పుట్టగొడుగుల పంట!


Sun,April 14, 2019 12:24 AM

వంటింట్లో వ్యర్థాలను ఉపయోగించి వినూత్నంగా ప్లాస్టిక్ బాటిళ్లలో పుట్టగొడుగుల పంటను సాగుచేస్తున్నారు ఛండీగఢ్‌కు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు. పర్యావరణానికి హానికలిగించే కారకాల ద్వారా పుట్టగొడుగులను సాగు చేయడమేకాకుండా, ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని నిరూపించారు.
college-grows-mashrooms
ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం వల్ల రోజురోజుకీ పర్యావరణ కాలుష్యం మరింతగా పెరుగుతుండడంతో లేనిపోని రోగాల బారిన పడాల్సి వస్తున్నది. అటువంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను, వంటింట్లో ఉండే ఇతర వ్యర్థాలను వృథాగా బయట పడేయకుండా, వాటితో ఏదైనా చేయాలని ఛండీగఢ్‌కు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆలోచించారు. పర్యావరణ హితానికి గొడుగు పట్టేలా పుట్టగొడుగుల సాగు చేయాలనుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వందనా శర్మ, సందీప్ కౌర్‌లు నాయకత్వం వహించారు. అందుకోసం ప్రత్యేకంగాఈ ప్రాజెక్టు కింద 6నెలల పాటు ప్రయోగాలు చేశారు. 1 లీటరు, 2లీటర్ల కూల్‌డ్రింక్ ఖాళీ సీసాల్లో పుట్టగొడుగులను ఏ విధంగా సాగు చేయవచ్చో ప్రయోగాత్మకంగా చేసి చూశారు. వారు చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలివ్వడంతో కళాశాల ప్రాంగణంలోనే పుట్టగొడుగుల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి చేసిన ఆలోచన ఇప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పించడమేకాకుండా కేంద్ర ప్రభుత్వం అవార్డుకు కూడా ఎంపికైంది.

222
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles