పీసీఓఎస్ నియంవూతణ -8


Wed,October 30, 2013 03:03 PM

పీసీఓఎస్ రావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఒత్తిడి. ఒత్తిడిని కంట్రోల్ చేసే నౌకాసనంతో పాటు శ్వాసమీద దృష్టి పెట్టి ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. పీసీఓఎస్‌ను ప్రభావితం చేసే ఈ ఆసనం వల్ల కటిభాగంలో పేరుకున్న కొవ్వు కరగడమే కాకుండా పెల్విక్ ఏరియా తెరుచుకుంటుంది. దీంతో పాటు ప్రాణాయామం కూడా చేస్తే మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పోయి ఒత్తిడి కూడా తగ్గుతుంది.
yoga
నౌకాసనం
నౌకను పోలిన ఆసన స్థితి ఉంటుంది కాబట్టి దీనికి నౌకాసనం అని పేరు వచ్చింది. పాదాలను ముందుకు చాచి, చేతులను శరీరానికి సమాంతరంగా ఉంచి దండాసనంలో (ఫొటో1) కూర్చోవాలి. ఇప్పుడు (ఫొటో 2) రెండు మోకాళ్లను ఒక దగ్గరగా తీసుకురావాలి. మోకాళ్ల కిందినుంచి చేతుల సపోర్ట్ ఇస్తూ శరీరానికి సమాంతరంగా కాళ్లను (ఫొటో 3) పైకెత్తాలి. శరీరం వెనుకకు పడిపోకుండా చేతులను కాళ్లకి ఇరుపక్కల చాచి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ స్థితిలో పాదాలు రెండు దగ్గరగా ఉంచి నెమ్మదిగా గాలిపీల్చుకుంటూ పాదాలు రెండింటినీ పైకి తీసుకొనిరావాలి. మోకాళ్లు వంచకూడదు. రెండు చేతులనూ నేలకు సమాంతరంగా ఉంచాలి. అరచేయి నేలవైపు (ఫొటో4) ఉండాలి. ఇదే స్థితిలో 8 సెకన్ల పాటు ఉండాలి. గాలి వదులుతూ మామూలు స్థితికి రావాలి. కొద్ది సాధన తరువాత చేతుల సపోర్ట్‌తో కాళ్లను ఇంకాస్త పైకెత్తి నౌకాసనం అడ్వాన్స్‌డ్ (ఫొటో5) కూడా ప్రయత్నించవచ్చు.

ఉపయోగాలు :
-ఆకలిని బాగా అదుపులో ఉంచుతుంది.
-పొట్టదగ్గర కొవ్వును కరిగిస్తుంది.
- నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలను ఉత్తేజపరుస్తుంది.

జాగ్రత్తలు :
- హెర్నియా, స్టమక్ అల్సర్ ఉన్నవారు చేయకూడదు.

గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

4920
Tags

More News

VIRAL NEWS