
అందంలో ప్రత్యేకపాత్ర పోషించేది హెయిర్‌ైస్టెల్. వత్తయిన జుట్టు ఆడ, మగ తేడా లేకుండా ఎవరిలోనైనా కీలకమైనదే. అందుకే బట్టతల బారిన పడ్డవారి బాధ వర్ణనాతీతం. అయితే వైద్యరంగంలో అన్ని సమస్యలకూ పరిష్కారాలు ఉన్నట్టే బట్టతల సమస్యకు కడా అనేక అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
బట్టతల సమస్య పురుషుల్లో 50 శాతంగా ఉంటే, మహిళల్లో ఇది 25 శాతంగా ఉంది. ఒక వ్యక్తి తల మీద లక్ష నుంచి లక్షన్నర వరకు జుట్టు కుదుళ్లు ఉంటాయి. ప్రతి కుదురు జీవిత కాల సమయం 3 నుంచి 4 సంవత్సరాలుంటుంది. ఇందులో దాదాపు 25 నుంచి 30 జుట్టు కుదుళ్లు జీవిత కాల సమయాన్ని పూర్తిచేసుకొని రాలిపోయేందుకు సిద్ధంగా ఉంటాయి. నిజానికి అది హెయిర్ ఫాల్ కాదు. కాని కొన్నిసార్లు పోషకాహారం, ఖనిజాల లోపం, ఫంగస్ ఇన్ఫెక్షన్లు గర్భం దాల్చినప్పుడు, తీవ్ర మానసిక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల జుట్టు రాలిపోతుంది. అలాంటప్పుడు సరైన కారణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే బట్టతల, జుట్టు రాలే సమస్యల నుంచి బయటపడవచ్చు. దానికి సంబంధించిన మూడు రకాల చికిత్స విధానాలున్నాయి.
స్టెమ్‌సెల్ ఇంజెక్షన్
ఆండ్రోజెనిక్ అలోపేషియా విధానంలో చికిత్స ఉంటుంది. స్త్రీ, పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ కెమికల్ రియాక్షన్ వల్ల డిహెచ్టీగా మారుతుంది. దీనివల్ల తలలోని జుట్టు కుదళ్లపై దాడిచేయడం ప్రారంభమై కుదుళ్లను కొద్ది కొద్దిగా నాశనం చేస్తుంది. దీనికోసం డీహెచ్‌టీ కుదుళ్లకు వెళ్లి రక్త ప్రసరణపై, కుదుళ్ల ఎదుగుదలకు కావాల్సిన సిగ్నల్స్‌ను కుదుళ్లకు చేరకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల జుట్టు రోజు రోజుకూ పలుచబడి, చివరికి రాలిపోతుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు స్టెమ్‌సెల్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ దెబ్బతిన్న జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ చేయించి, మళ్లీ జుట్టు ఎదుగుదల సిగ్నల్స్‌ను అందజేయడం ద్వారా అవి పునరుత్తేజం అవుతాయి.
ఎసెల్ ప్లస్ పీఆర్పీ ఇంజెక్షన్
ఎ-సెల్, పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా)తో కలిపి వెంట్రుకలకు ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న వెంట్రుకలు కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అంతేకాదు, జుట్టు పెరుగుతుంది. జుట్టును రీప్రొడ్యూస్ చేయగల ఫ్యాక్టర్స్ పీఆర్పీలో ఉంటాయి. అందుకే పురుషులకైనా, మహిళలకైనా ఈ ఇంజెక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. మొదట పీఆర్పీ ప్రొడ్యూస్ చేసిన బ్లడ్ శాంపిల్‌ను జాగ్రత్తగా ప్రాసెస్ చేసి ఉంచుతారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది రక్తంలో కనిపించే ప్లేట్లెట్ మిశ్రమంతో కూడిన బ్లడ్ ప్లాస్మా. ఇది వెంట్రుకలకే కాదు కనుబొమ్మలు, గడ్డానికి కూడా చేసుకోవచ్చు. చికిత్స అనంతరం రెండు నెలల తరువాత వెంట్రుకల్లో అభివృద్ధి కనిపించినా పూర్తి ఫలితం కనిపించడానికి 4నెలల నుంచి సంవత్సర కాలం పట్టవచ్చు. ఇది పురుషుల్లో చిన్న వయసులో వచ్చే బాల్డ్ నెస్‌ను అధిగమించడానికి, మహిళల్లో కనిపించే అన్ని రకాల జుట్టు రాలిపోయే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.
మీసోథెరపీ with PRP & Stemcell Activators
ఈ చికిత్స విధానం రాలిపోతున్న జుట్టును అరికట్టడానికి, కొత్త జుట్టు రావడానికి బాగా పనికొస్తుంది. స్టెమ్‌సెల్స్ సోర్స్తోనే ఈ థెరపీ జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మిశ్రమానికి గ్రోత్ ఫ్యాక్టర్స్‌ను మిక్స్ చేసి తలలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్టెమ్‌సెల్ థెరపీ, మీసోథెరపీ చికిత్సల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు.
తెల్లజుట్టుకు చికిత్స
గ్రేకలర్లోకి మారిన జుట్టును మామూలు రంగులోకి తేవడానికి ఉపయోగించే గ్లో-మెలనిన్ అనే శాస్త్రీయ పద్ధతితో కూడిన చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఆరు వారాల పాటు సాగే ఈ చికిత్స విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
60 శాతం కంటే ఎక్కువ జుట్టు లేకుండా బట్టతలతో బాధపడుతున్న వారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు స్టెమ్‌సెల్ థెరపీని కూడా అందిస్తారు. దీనివల్ల 100 శాతం సత్ఫలితాలను పొందవచ్చు.