పిల్లల కోసం కొత్త రూటు భవిష్యత్తుకు గేరు మార్చి


Wed,April 17, 2019 01:04 AM

చేతిలో రెండు, మూడు డిగ్రీలున్నాయి. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించింది. ఉన్నతంగా ఎదగాలనుకుంది. కోర్టుకెళ్లి న్యాయం కోసం వాదించాల్సిన ఆమె ట్రక్కు డ్రైవర్‌గా రోజులు గడుపుతున్నది. పిల్లల భవిష్యత్‌కోసం ఆమె రూటు మార్చి ఆత్మైస్థెర్యంతో బతుకు బండి నడుపుతున్నది.
yogitha
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగితా రాఘువంశీ ఆమె పిల్లల చదవుల కోసం ట్రక్కు నడుపుతున్నది. ఈ పని అయితే ఏ రోజు డబ్బు ఆరోజే ఇచ్చేస్తారు. ఇంత చదువు చదివి లారీ డ్రైవర్ అంటే జనాలు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు నా కుటుంబం ముఖ్యం అనుకున్నది. ఈ 16 యేండ్ల క్రితం వయస్సులోనే ట్రక్కు డ్రైవర్‌గా విధుల్లో చేరి దేశ నలుమూలూ ప్రయాణించింది. రాత్రింబవళ్లు తేడా లేకుండా గమ్యం చేరడానికి కృషి చేస్తున్నది. అన్ని ప్రాంతాలు తిరిగి అక్కడి వారితో మాట్లాడడం వల్ల ఆమె ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషలు అవలీలగా మాట్లాడగలదు. గంటకు 45 కి.మీ వేగంతో రోజుకు 500 కి.మీ. దూరం ప్రయాణం చేస్తున్నది. యోగితా 2013లో మహీంద్రా ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకుంది. ఇది ఇప్పటి పరిస్థితి కానీ యోగితా జీవితం ఆమె డ్రైవర్‌గా మారకముందూ ఇంకోలా ఉండేది.

యోగితా చిన్నప్పటి నుంచే భవిష్యత్తుపై చాలా ఆశలు పెట్టుకున్నది. కామర్స్‌లో డిగ్రీచేసి, న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. ఈ క్రమంలోనే భోపాల్ హైకోర్టులో లాయర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజ్‌బహదూర్ రఘువంశీని పెండ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత రాజ్‌బహదూర్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. యోగితా ఇద్దరుపిల్లలతో ఒంటరిదైంది. ఆమెకు ప్రపంచం చీకటైనట్లు కనిపించింది. జూనియర్ లాయర్‌గా ఉద్యోగం చేస్తే ఆ జీతంతో పిల్లల చదువు కాదు కదా, కడుపు నిండా తిండి పెట్టడం కూడా కష్టమే. ఇంకేం చేయాలి. ఏం పని చేస్తే కుటుంబం నడుస్తుందని ఆలోచించింది. లారీ డ్రైవర్‌గా చేస్తే ఏ రోజు డబ్బు ఆరోజే ఇచ్చేస్తారని పిల్లల భవిష్యత్ కోసం ఆమె రూటు మార్చుకుంది. సడలని ధైర్యంతో ఆమె విధులు నిర్వహిస్తూ, పిల్లలను చదివిస్తున్నది.
yogitha1

198
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles