పిల్లల కోసం ఉడ్నేదో!


Sat,January 19, 2019 11:11 PM

ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా విద్యార్థినులపై లైంగిక వేధింపులు అధికం అయ్యాయి. అభం శుభం తెలియని చిన్నారులనూ కామాంధులు వదలడం లేదు. అందుకే.. చిన్నారులపై ఎలా దాడులు జరుగుతాయో తెలిపేందుకు ఓ చక్కని షార్ట్‌ఫిలీం రూపొందించారు.
Udne-Do
ముంబైకి చెందిన చలనచిత్ర నిర్మాత ఆర్టీ బాగ్డీ. ఆమె చిన్నారులపై లైంగిక వేధింపులు ఏవిధంగా జరుగుతున్నాయో ఉడ్నే దో అనే షార్ట్ ఫిలీ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది. స్కూల్లో పిల్లలు అందరితో సరదాగా ఉంటారు. క్లాస్‌లు వినడం, చదువుకోవడం, ఆడుకోవడమే వీరికి తెలు సు. అక్కడ పనిచేసే యాజమాన్యం గాని, పనివాళ్లు కాని ఎవరైనా మాట్లాడితే చాలా గౌరవంగా సమాధానం చెప్పే తత్వం పిల్లలిది. వంటిమీద చేయివేస్తే ఎందుకు వేసారో పనిగట్టేంత వయసు వారికి లేదు. అయినా ఎదుటి వారి స్వర్శతో ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం దూరంగా వెళ్లిపోతారు. మరలా వారిని చూసినప్పుడు భయపడుతుంటారు. చివరికి స్కూల్‌కి వెళ్లడానికే సంకోచిస్తారు. ఇంట్లో అమ్మానాన్నలతో చెబుదామంటే ఏమంటారో అన్న భయం. అయినా చెప్పాలని తల్లిదగ్గరికి వెళ్లితే మాట వినిపించుకోకుండా వెళ్లిపోతుంది.


ఎవరితో చెప్పుకోలేక మనసులోనే మదనపడుతుంటుంది ఓ చిన్నారి. తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారంటే ఇందుకే మరి. తన బాధని పసిగట్టిన ఫ్రెండ్‌కి మొత్తం వివరిస్తుంది. తనని తాను రక్షించుకోవడానికి పెప్పర్ స్ప్రే, విజిల్‌ని ఇస్తాడు ఆ అబ్బాయి. ఆ కామంధుడు మళ్లీ వస్తాడు. మాయమాటలు చెప్పి ఆమెపై చెయ్యి వేస్తాడు. తన దగ్గరున్న స్ప్రే కంట్లో కొట్టి, విజిల్ వేస్తుంది. అలా ఆ కామాంధుడి రూపాన్ని బయటపెడతారు ఆ ఇద్దరు పిల్లలు. ఇదే షార్ట్ ఫిలీం సారాంశం. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా ఉండాలని చెప్పే మంచి సందేశాన్ని ఇస్తుందీ ఫిలీం. ఇందులో లీడ్ రోల్ చేసింది సీనియర్ నటి రేవతి. ఈ షార్ట్ ఫిలీంకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

785
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles