పాస్‌పోర్ట్ పొందండిలా..


Fri,May 3, 2019 01:13 AM

విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. దాన్ని ఎలా పొందాలో చాలామందికి తెలియదు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకుంటే అగ్గువలో అయిపోయేదానికి బ్రోకర్లను నమ్మి వేలకు వేలు డబ్బును వృథా చేస్తుంటారు. దీని మీద అవగాహన అవసరం. ఈ సులువైన పద్ధతులను ఫాలో అయి పాస్‌పోర్ట్‌ను పొందండి.
Passport
-పాస్‌పోర్ట్ దేశ పౌరుడిగా ఇచ్చే గుర్తింపు. అంతర్జాతీయంగా ప్రయాణాలు చేయడానికి చాలా అవసరం అవుతుంది. వీసా లేకుండాఅయినా ప్రయాణం చేయొచ్చు కానీ పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణం సాధ్యపడదు. విదేశీ పర్యటన జరుగాలంటే పాస్‌పోర్ట్ కావాలి.
-ఇది అత్యంత ప్రాముఖ్యమైన దశ. www. passport.gov.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పేరు, తండ్రి పేరు నుంచి మొదలు పుట్టిన స్థలం, నివాస స్థలం వంటి అన్ని వివరాలను అడుగుతారు. ఇక్కడ అవసరం అయిన వివరాలను చేర్చితే రిజిస్టేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
-అదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఫామ్ ఉంటుంది. అవసరం అయిన వివరాలను పూరించి తిరిగి అప్‌లోడ్ చేయాలి.
-ఈ ఆన్‌లైన్ ఫామ్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ వంటి పత్రాలను అటాచ్ చేయాలి. ఏవైతే పత్రాలను అటాచ్ చేస్తారో అవే పత్రాలను వెరిఫికేషన్ రోజు కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
-ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు షెడ్యూల్‌లో అపాయింట్‌మెంట్ ఎప్పుడు, ఎక్కడ అనే అంశం కూడా ఉంటుంది. అది ఎంపిక చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నార్మల్ పాస్‌పోర్ట్ అయితే 1500 రూపాయలు, తత్కాల్ పాస్‌పోర్ట్‌కు అయితే 3500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించి ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఈ మెయిల్ ఐడీకి మెయిల్ కూడా వస్తుంది.
-పాస్‌పోర్ట్ కార్యాలయానికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వెళ్లేటప్పుడు ఒకటి ఒరిజినల్, ఒకటి జిరాక్స్..ఇలారెండు సెట్స్ డాక్యుమెంట్స్‌ని వెంట తీసుకెళ్లాలి. అపాయింట్‌మెంట్ స్లిప్ కూడా వెంటపెట్టుకొని వెళ్లాలి. అదిలేకపోతే ఆఫీస్‌లోకి ఎంట్రీ ఉండదు.
-లోపలికి వెళ్లాక ఏబీసీ అని మూడు కౌంటర్లు ఉంటాయి. బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్స్, ఫొటోగ్రాఫ్స్ తీసుకున్నాక చివరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఉన్నతాధికారులతో కలిస్తే పాస్‌పోర్ట్ కార్యాలయంలో ప్రక్రియ ముగుస్తుంది.
-ఆ తర్వాత పోలీసుల వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్లనుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వారం నుంచి పదిహేను పనిదినాల్లో పాస్‌పోర్ట్ మీరిచ్చిన అడ్రస్‌కు పోస్ట్ ద్వారా చేరుతుంది.

277
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles