పాలు వద్దంటున్న ట్రైనర్!


Mon,February 4, 2019 01:22 AM

పిల్లలకు తప్పనిసరిగా పాలు తాగించాలా? పాలలో దొరికే పోషకాలు ఇతర ఆహార పదార్థాలలో దొరుకుతాయా? అన్న సందేహం ఉంటుంది. పాలు అవసరం లేదంటున్నదో ట్రైనర్. ఎందుకో కూడా వివరించింది.
milk
పిల్లలకు పాలు అవసరం లేదంటున్నారు రుజుత దివేకర్. ఈమె ఫిట్‌నెస్ ట్రైనర్. కరీనా కపూర్, అలియా భట్‌లాంటి సెలెబ్రిటీలకు రుజుత ఫిట్‌నెస్ ట్రైనర్. ఆమె నోట్స్ ఫర్ హెల్దీ కిడ్స్ అనే పుస్తకం రాశారు. ఇందులో పిల్లలకు పాలు తప్పనిసరి కాదని రాసింది ఈవిడ. కెనడాలో దాదాపు ఇలాంటి ఆదేశాలే ఉన్నాయి. కెనడా ఫుడ్‌గైడ్‌లో పాలు తప్పనిసరి అని చెప్పలేదు. ఆయా కాలాల్లో దొరికే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొందరు పాలలో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి ఇస్తుంటారు. అలా చేస్తే పాలు తాగి ఏం ప్రయోజనం అంటుంది రుజుత. దాంతో పాటు లావైపోతారని కెనడా నిపుణులు అంటున్నారు. పౌడర్ కలుపడం వల్ల పాల ప్రయోజనాలు తగ్గిపోతాయని చెబుతున్నది. నువ్వుల చిక్కీలు, శనగపిండి లడ్డు, రాగి పాయసం, దోశతో కూడా కాల్షియాన్ని భర్తీ చేయవచ్చని రుజుత అంటున్నారు. బాదం, సోయా, రైస్‌మిల్క్ లాంటి నాన్‌డెయిరీ మిల్క్ కొనేటప్పుడు వాటిమీద లేబుల్ తప్పకుండా చూడండి. అందులో విటమిన్‌లు, ఖనిజాలు ఉన్నాయో లేదో పరిశీలించండి. ఫార్టిఫైడ్ పాలయితే పిల్లలకు మంచిదే. పాలకు బదులు బలవర్దకమైన ఆహారం తినిపిస్తే పాలతో పనిలేదంటున్నదీమె.

830
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles