పాదాల సంరక్షణకు..


Mon,September 3, 2018 11:33 PM

feet-cleaning
-వర్షంలో తడువడం వల్ల పాదాల్లో తేమ పెరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియాలు సోకి దురద, మంట, తామర వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
-బురద పాదాలకు తగులడం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది. గోరువెచ్చని నీటిలో పాదాలను పదినిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో కడిగి, తడిలేకుండా తుడుచుకోవాలి.
-బయటకి వెళ్లే ముందు పాదాలను పొడి టవల్‌తో తుడిచి, టాల్కం పౌడర్‌ను రాసుకొని కొద్ది సేపు ఆరనివ్వాలి. టాల్కం పౌడర్‌తోపాటు కర్పూరం కలిపి రాయడం మంచిది. అలా రాసిన తర్వాత సాక్స్ గానీ బూట్లు గానీ ధరించాలి.
-ప్రతి రోజూ పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవడం ద్వారా ఆయా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. పాదాల పగుళ్లు లేకపోయినా బాదం నూనె, ఆలివ్ నూనెతో మసాజ్ చేయడం వల్ల మృదువుగా ఉంటాయి.
-గోరువెచ్చని నీటిలో షాంపూను కలిపి 5-నుంచి 10నిమిషాల వరకు పాదాలను నానబెట్టాలి. అలా చేయడం ద్వారా పాదాలపై ఉండే మృత కణాలను సులువుగా తొలిగించవచ్చు.
-వర్షకాలంలో తడిగా ఉన్న బూట్లను ధరించకూడదు. రాత్రి పూట గాలి తగిలే విధంగా బూట్లను ఉంచి ఉదయాన్నే కూడా కాస్త ఎండలో ఎండిన తర్వాతనే ధరించడం మంచిది.

388
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles