పాదాలపై పగుళ్లా?


Thu,February 7, 2019 01:41 AM

చలికాలంలో తరచూ ఆడవారికి కాళ్లు పగులుతూ ఉంటాయి. ఆ నొప్పితోనే వారు ఇంటి పని, వంట పని చేస్తుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే సుతిమెత్తని పాదాలు మీకు సొంతం.
foorcare
-మర్రి ఆకులను తుంచగా వచ్చే పాలను పాదాల పగుళ్లపై రాయాలి. ప్రతిరోజూ ఈ పద్ధతి పాటించాలి. ఇలా చేస్తే పగుళ్లు మాయం.
-ప్రతి రోజూ పాదాలను గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వేళ్ల సందుల్లో తడి పూర్తిగా ఆరేలా పొడి బట్టతో తుడువాలి.
-గ్లిజరిన్ లోషన్‌ను రాత్రి పడుకునే ముందు కాళ్లకు తప్పకుండా రాసుకోవాలి. లేదంటే కొబ్బరి నూనెని కూడా వేళ్లకు పూసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేస్తే పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
-పాదరక్షలు వాడకుండా తిరగడం వల్ల కూడా ఒక రకమైన ఫంగస్ కాళ్లకు అంటుకుంటుంది. ఈ ఫంగస్ పెరిగి పగుళ్లకు దారితీస్తుంది. చెప్పులు లేకుండా బయట తిరగొద్దు.
-ఆవనూనె గానీ, నువ్వుల నూనె గానీ వేడిచేసి అందులో కొంచెం పసుపు, కరిగిన కొవ్వొత్తిని పొడి చేసి మెత్తగా తయారు చేసుకోవాలి. పడుకునే ముందు కాళ్లు శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా తుడుచుకొని తయారు చేసిన మిశ్రమాన్ని పాదాలకు రాయాలి. ఇలా15 రోజులపాటు పాదాలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

588
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles