పాంచ్ కేదార్.. పక్కా వెళ్లాలి


Fri,March 8, 2019 01:55 AM

అతి ఎత్తయిన ప్రదేశంలో శివుడి విగ్రహం ఎక్కడ ఉన్నది? దాని ప్రత్యేకతలేంటి? అక్కడి వాతావరణ పరిస్థితుల సమగ్ర సమాచారంతో తుంగ్‌నాథ్ ప్రదేశ పరిచయం..
Tungnath
చుట్టూ ఎత్తయిన పర్వతాలు.. కనుచూపు మేర మంచు.. ఎముకలు కొరికే చలి ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఒక్కసారి వెళ్తే అక్కడే ఉండిపోవాలనిపించే అనుభూతిని కలిగించే ప్రదేశమిది. సముద్ర మట్టానికి 12073 అడుగుల ఎత్తులో అతి ఎత్తయిన శివుడి విగ్రహం ఉన్నది. ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రాంతంలో ఒకే దగ్గర అత్యధిక శివుడి ఆలయాలున్నాయి. ఇది చాలా అరుదైన ప్రాంతం. పర్వత ప్రాంతంలో ఐదు శివుడి ఆలయాలున్న ఈ ప్రదేశాన్ని పాంచ్ కేదార్ అంటారు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో తుంగ్‌నాథ్ ఉన్నది. మందాకిని, అలకానంద నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. ఐదు వేల ఏండ్ల పురాతన చరిత ఈ ఆలయాల సొంతమని అక్కడివారి నమ్మకం. సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా 16 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. చలికాలంలో మంచు కురుస్తుండడంతో సుమారు ఆరునెలల పాటు ఆలయ పరిసర ప్రాంతాలకు పర్యాటకులను రావడం ఆపేస్తారు. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్లకు ఇండియాలోనే ఇది బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్. భూలోక స్వర్గంగా.. భూలోక శివకేంద్రంగా పిలువబడే పాంచ్‌కేదార్‌ను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైన వెళ్లాలి. తప్పకుండా చూడాలి.

484
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles