పాంక్రియాటైటిస్ ప్రాణాంతకమా?


Sat,April 13, 2019 12:31 AM

మా నాన్న వయసు 45 సంవత్సరాలు. ఆయనకు మద్యపానం అలవాటు ఉంది. కొన్ని నెలలుగా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, కడుపుమంటతో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి పాంక్రియాటైటిస్ సమస్య అన్నారు. సర్జరీ చేయడమే మార్గం అన్నారు. మాకు భయంగా ఉంది. ఇది ఎందుకు వస్తుంది? ప్రాణాంతక వ్యాధా? దయచేసి తెలుపగలరు.
- జే. నాగేశ్వర్, కోదాడ

Councelling
ఇది సాధారణమైన వ్యాధే. కానీ ప్రమాదకరమైంది. కొన్ని జాగ్రత్తలు.. చికిత్స తీసుకుంటే నయమవుతుంది. పిత్తాశయంలో రాళ్లు, మితిమీరిన మద్యపానం ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. పిత్తాశయంలో ఏర్పడే రాళ్లు పాంక్రియాటైటిక్ గొట్టాన్ని మూసివేసి క్లోమరసం ప్రవాహాన్ని నిరోధిస్తాయి. క్లోమరస వాహికకు అడ్డుపడటం వల్ల క్లోమగ్రంథిలో వాపు వస్తుంది. కొందరిలో హెరిడిటీ సమస్య, జీన్స్ ప్రభావం, జంక్ ఫుడ్ తీసుకోవడం, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. ఈ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. 1. అక్యుట్ పాంక్రియాటైటిస్, 2. క్రానిక్ పాంక్రియాటైటిస్. అక్యూట్ పాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చినట్లయితే భరించలేని కడుపు నొప్పి వస్తుంది. ఇది క్రమంగా వీపువైపు పాకి వాంతులు వస్తాయి. డయేరియా కూడా సోకవచ్చు. పిత్తనాళంలో ఏర్పడే రాళ్లవల్ల రక్తంలో కొవ్వు, క్యాల్షియం పరిమాణం పెరుగుతాయి. పాంక్రియాటైటిస్ వ్యాధి లక్షణాలు ఏంటంటే.. భోజనం చేసిన తర్వాత పొట్ట పైభాగంలో నొప్పి ప్రారంభమవుతుంది. తల తిరుగుతుంది. తీవ్రమైన జ్వరం.గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీటివల్ల పొట్టలో నీరు ఎక్కువగా చేరి కామెర్లకు దారితీస్తుంది. రక్త పరీక్ష, సీరమ్ లైపేజ్ పరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. నెక్రోసేక్టమీ శస్త్ర చికిత్స ద్వారా కుళ్లి పాడైపోయిన పాంక్రియాటైటిస్ కణజాలాన్ని తొలగిస్తారు. కాబట్టి మీరు చికిత్సపై దృష్టిసారించి మీ నాన్నను కాపాడుకోండి!

-డాక్టర్ జి. పార్థసారధి
-సీనియర్ సర్జికల్ గాస్ట్రో ఎంటరాలజిస్ట్
-యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ

125
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles