పవర్‌బ్యాంక్ కొంటున్నారా?


Wed,February 6, 2019 01:45 AM

powerbank
ఇంటర్నెట్ వాడే వేగానికి మొబైల్‌లో చార్జింగ్ కూడా అంతేవేగంగా అయిపోతున్నది. ఇందుకు పరిష్కారం.. పవర్‌బ్యాంకులు. అయితే.. నాసిరకం, నకిలీ పవర్‌బ్యాంకులు కొని మోసపోకుండా ఈ చిట్కాలు పాటించండి.


- మార్కెట్లో ఒరిజినల్ బ్రాండ్లు ఎన్ని ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ నకిలీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. అందుకే.. ఏదైనా బ్రాండ్ కొనేటప్పుడు పేరు, లోగోను నిశితంగా పరిశీలించండి.
- రోడ్డు పక్కన అమ్మే పవర్‌బ్యాంకులు కొంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొండి.
- పవర్‌బ్యాంక్ కొనేముందు మొబైల్ బ్యాటరీ కెపాసిటీకి సరిపోయేలా కొనండి.
- మీ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్ అయితే.. 6000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్ కొనండి. రెండు యూఎస్‌బీ పిన్నులు జతచేసుకునేది ఉంటే ఇంకా బెటర్.
- తక్కువ ధరలో వస్తుంది కదా.. అని తొందరపడి ఏదో ఒకటి కొనకండి. మంచి సామర్థ్యం ఉన్న పవర్‌బ్యాంకు ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది.
- ఎంత ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్‌బ్యాంకు అయితే.. అన్ని ఎక్కువసార్లు మొబైల్‌కి చార్జింగ్ పెట్టుకోవచ్చు.
- ఆన్‌లైన్‌లో కొనేకంటే.. ఏదైనా మంచి షాప్‌కెళ్లి కొనడం బెటర్. అక్కడైతే చెక్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

2072
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles