పర్యావరణహిత సంబురాలు


Sat,February 9, 2019 02:03 AM

వారంతా ప్రకృతి ప్రేమికులు. ముఖ్యంగా అడవితల్లి బిడ్డలు. అక్షరజ్ఞానం లేని పామరులు. అయితేనేం జీవితాన్నిచ్చిన ప్రకృతి అంటే వారికి ఎనలేని ప్రేమ. వారు జరుపుకునే పండుగలు, వేడుకలు, జాతరలు ఏవైనా.. పర్యావరణహితమైనవే.
Rice
మన దగ్గర ఏదైనా జాతర, పండగ జరిగిందంటే చాలు.. ఎక్కువగా కనిపించేవి ప్లాస్టిక్ ఉత్పత్తులు. ఇవి పర్యావరణానికి ఎంత హాని చేస్తాయో.. మనకు తెలిసి కూడా వాటిని ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే, నాగాలాండ్‌లోని కొనియక్ నాగా తెగ వారు మాత్రం అలాంటి ప్రకృతి విరుద్ధ వేడుకలకు చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే వారికి ప్రకృతి, పర్యావరణం అంటే ఎనలేని ప్రేమ. ఒక్కమాటలో చెప్పాలంటే కన్నతల్లితో సమానం. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని గిరిజనులు ఏడాదికి రెండుసార్లు కొన్యక్ లావోఒంగ్ మోజాతర జరుపుకుంటారు. పంటలు ఇళ్లకు చేరిన సందర్భంగా ఇలా వేడుకలు చేస్తుంటారు. ఈ జాతర ఆసాంతం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఎక్కడా కూడా ప్లాస్టిక్ వస్తువులు కనిపించవు. పూజకు కావాల్సిన వస్తువుల నుంచి వారి దేవత అలంకరణ, తీసుకునే ఆహారం వరకూ అన్ని ఆరోగ్యకరమైన వస్తువులే. కొనియక్ నాగ గిరిజనులు మొదటి నుంచీ ఇలాగే పండగలు చేసుకుంటున్నారు. ప్రకృతికి కీడు చేసే పదార్థాలంటే వారికి అసహ్యం. ఇక్కడ అక్షరాస్యత కేవలం 60శాతం మాత్రమే. ఈ జాతర సందర్భంగా సేంద్రియ ఉత్పత్తులను ఆకులలోనే ప్యాకింగ్ చేసి అమ్ముతుంటారు.

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles