పరీక్షల భయం పోయేదెలా?


Sat,March 16, 2019 12:05 AM

మా అమ్మాయి నేటి నుంచి పదో తరగతి ఫైనల్ పరీక్షలు రాస్తున్నది. బాగానే ప్రిపేర్ అయింది. స్పెషల్ ట్యూషన్స్ కూడా చెప్పించాం. పరీక్షలు దగ్గర పడే కొద్ది తనలో ఆందోళన మొదలైంది. పరీక్షలు ఇవాళే కాబట్టి.. పూర్తయ్యే వరకు టెన్షన్ లేకుండా ఎలా చదువుకోవాలి? ఒత్తిడిని ఎలా అధిగమించాలి? పరీక్ష హాల్‌లో సమయం.. ప్రశ్నల్ని ఎలా డీల్ చేయాలో.. మంచి స్కోర్ ఎలా సాధించాలో తెలియజేయగలరు.
-ఎస్‌ఆర్ రమణకుమార్, హన్మకొండ
Councelling
పరీక్షలు అనగానే ఒత్తిడికి లోనవడం సహజంగా పిల్లలందరిలోనూ కనిపిస్తున్న సమస్య. తండ్రిగా మీరు మీ అమ్మాయి పట్ల కేర్ తీసుకుంటున్నందుకు అభినందనలు. మీ అమ్మాయి బాగానే ప్రిపేర్ అయింది అన్నారు కదా.. ఏం చదివినా.. ఎంత చదివినా దానికి పక్కా ప్రణాళిక ఉండాలి. ఇంకోటి.. ప్రణాళిక ప్రకారం చదవడం ఎంత అవసరమో సమాధానాలు రాయడంలో కూడా అంతే నేర్పు అవసరం అనేది పిల్లలు.. తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి. పరీక్షలు ఈ రోజు నుంచే కాబట్టి ఎలా రాస్తామో? అనే ఆందోళన సహజం. తోటి విద్యార్థులతో పోల్చుకోవడం కూడా ఈ సమస్యకు ఓ కారణం. దీని నుంచి బయటపడాలంటే ముందు విద్యార్థులు పరీక్ష భయాన్ని వీడాలి. ఇప్పటివరకు చాలా పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి.. ఇది కూడా అలాంటిదే అని భావించాలి. పరీక్ష హాల్‌కు వెళ్లడమే ఉత్సాహంగా వెళ్లాలి. క్వశ్చన్స్ ఏంటీ? దానికి ఆన్సర్ ఏంటి మాత్రమే ఆలోచించాలి. పక్కవాళ్లేం రాస్తున్నారు? ఎదుటివాళ్లెలా రాస్తున్నారు వంటి విషయాలు అస్సలు పట్టించుకోవద్దు. చీటికిమాటికీ టైమ్ చూసుకోవద్దు. ప్రతీ ఆఫన్నవర్‌కి ఇన్విజిలేటర్స్ టైమ్ అనౌన్స్ చేస్తారు.

గంట కూడా మోగుతుంది. పిల్లల ధ్యాస ఎంతసేపూ రాయడం మీదనే ఉండేలా మీరు మోటివేట్ చేయాలి. పరీక్షకు కనీసం గంట ముందు చదవడం ఆపేయాలి. స్నేహితులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల గురించి మాట్లాడొద్దు. పరీక్షలో మీ పేపర్‌కు మీరే బాస్ అనే పాజిటివ్ దృక్పథాన్ని పిల్లల్లో కలిగించాలి. ఇక పిల్లలు ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని ఆందోళన చెందొద్దు. కఠినంగా ఉంటే అందరికీ కఠినంగా ఉన్నట్టే అనే విషయం గ్రహించాలి. ప్రశ్నాపత్రంలో సులభ ంగా ఉన్న ప్రశ్నలు మొదట ప్రారంభిస్తే ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఒకవేళ ఒత్తిడి అనిపిస్తే.. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే 2-3 నిమిషాలు బ్రీత్ ఎక్సర్‌సైజ్ చేయాలి. మైండ్ ఫ్రెష్ అయి ఏకాగ్రత పెరుగుతుంది. ఎంత బాగా చదివినా.. గుర్తున్నా రాసే విధానంతోనే ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. డెఫినేషన్ ఉంటే దాన్ని ముందు లీడ్‌గా తీసుకొని రాయాలి. సైడ్ హెడ్డింగ్స్‌కు అండర్‌లైన్స్ చేసి.. అవసరమైన చోట బొమ్మలు వేయాలి. మంచి ఆహారం తిని.. రాత్రిపూట సక్రమంగా నిద్రపోతే మీకు ఏ సమస్యా రాదు. ఆల్ ది బెస్ట్.
Atla-Srinivas-Reddy

942
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles