పరదాల రెపరెపలు!


Wed,February 20, 2019 01:16 AM

ఇంటికి పరదాలు ఎంతో అందం. కిటీకీలకు గానీ, తలుపులకు గానీ పరదాలు మరింత అందాన్ని తీసుకొస్తాయి. కర్టెన్ల వాడకంలో కొన్ని సూచనలున్నాయి. అవేంటో ఈ కింది చిట్కాల ద్వారా తెలుసుకోండి.
cortens
-కరెన్లని ఎక్కువ రోజులు మార్చకుండా ఉంటే రింగులు తుప్పుపట్టే అవకాశం ఉంది. వాటిని వెనిగర్ వేసిన నీటిలో కాసేపు మరిగిస్తే తుప్పు వదిలిపోతుంది. ఇలా చేస్తే తళతళా మెరువడంతో పాటు కొత్తవిగా కనిపిస్తాయి.
-కర్టెన్లను మార్చేటప్పుడు గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఆ రాడ్‌కి కాస్త సబ్బుని రాయాలి. ఆ తర్వాత ఎక్కించాల్సిన కర్టెన్‌ను తీసుకొని నెమ్మదిగా చినిగిపోకుండా రాడ్‌కు తగిలించాలి. లేకుంటే చినిగిపోయే ప్రమాదం ఉంది.
-మార్కెట్లో కొన్న కర్టెన్లు ఒక్కోసారి ఇంటి గుమ్మానికి సరిపోవు. అలాంటప్పుడు దానికి సరిపోయే రంగులో మరొక బట్ట తీసుకొని కుట్టించాలి. ఇలా చేస్తే వస్త్రం అందంగా ఉంటుంది. కావలసిన పొడవు కూడా సరిపోతుంది.
-ఎండలో ఉండే కర్టెన్లు రంగు కోల్పోతాయి. ఇంటిలోపల, బయట అన్ని కర్టెన్లు సరిపోవు. వాటికి తగ్గ కర్టెన్లను ఎంచుకోవాలి. లేదంటే రెండురోజులకే రంగు పోయి వికారంగా కనిపిస్తుంది.
-కిటికీ, దర్వాజా పొడువులను బట్టి కర్టెన్లను ఎంపిక చేసుకోవాలి. ముందుగా వీటి కొలతలు తీసుకొని ఆ తర్వాతే కొనుగోలు చేయాలి. గోడకు వేసిన పెయింటింగ్‌ను బట్టి కర్టెన్ ఎంపిక ఉండాలి. అప్పుడే ఇంటికి అందం.

401
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles