పనితనం రక్తాన్ని శుద్ధి చేసే కాలేయం


Tue,February 19, 2019 01:35 AM

Panitanam
జీర్ణక్రియకు కాలేయం (లివర్) అత్యంత ప్రధానం. కుడి ఛాతీ కింద, కడుపు, కిడ్నీలకుపైన త్రిభుజాకారంలో, చిక్కని ఎరుపు- గోధుమ వర్ణంలో ఇది నెలకొని ఉంటుంది. దేహంలో రెండు రకాలుగా రక్త సరఫరాను ఇది నిర్వర్తిస్తుంది. ఆక్సీజన్‌తో కూడిన రక్తం హెపాటిక్ ధమని నుంచి వస్తే, పోషకాలతో నిండిన రక్త ప్రవాహాలు ఆంత్రాల (పేగులు) నుండి హెపాటిక్ పోర్టల్ సిర ద్వారా కాలేయానికి చేరుతాయి. ఇలా వచ్చిన రక్తాన్ని కాలేయమే శుద్ధి చేసి దేహానికంతటికీ చేరవేస్తుంది. రక్తంలోని రసాయనిక స్థాయిల్ని ఇది క్రమబద్ధం చేస్తుంది. తాను ఉత్పత్తి చేసే పైత్యరసాన్ని పిత్తాశయానికి, ఆంత్రమూలానికి చేరవేస్తుంది. పిత్తరసం సాయంతోనే కాలేయంలోని వ్యర్థపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. కడుపుకు, ఆంత్రాలకు వెళ్లే రక్తమంతా కాలేయం గుండానే ప్రవహిస్తుంది. ఈ రక్తాన్నే ఇది విశ్లేషిస్తుంది. కనీసం ఎంత లేదన్నా 500కు పైగా క్రియలను కాలేయం నిర్వహిస్తున్నట్టు వైద్య పరిశోధనల్లో తేలింది. వాటిలో పైన పేర్కొన్నవే కాక విషతుల్యమైన అమ్మోనియాను యూరియాగా మార్చడం, రక్తం గడ్డ కట్టకుండా నియంత్రించడం వంటివెన్నో ఉన్నాయి.

770
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles