పనామాలో యువజన పాట


Tue,January 22, 2019 10:41 PM

ప్రపంచ యువజన దినోత్సవ వేడుకలకు పనామా వేదికైంది. దుబాయ్‌లోని ఈ కేంద్రం యువజనం కేరింతలతో మార్మోగనుంది. అయితే.. పనామా వేడుకల్లో భారతీయుల పాత్ర కీలకంగా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కల్చరల్ ఈవెంట్‌లో పాట పాడేందుకు సిద్ధమైంది ఇండియన్ యంగ్ టీమ్.
Young-Indians
దుబాయ్ కేంద్రంగా వరల్డ్ యూత్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. జనవరి 22 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో కల్చరల్ ఈవెంట్‌ది ముఖ్యపాత్ర. అలాంటి విశిష్టత గల కార్యక్రమాన్ని లీడ్ చేస్తూ పనామా వీధుల్లో పాట ప్రభంజనం మోగించేందుకు సిద్ధంగా ఉన్నారు అక్కడ స్థిరపడిన భారతీయ యువతీ యువకులు. ఈ పాట ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉంటుంది. పనామా సెలబ్రేషన్స్ థీమ్ సాంగ్ కూడా ఇదే. పనామా సిటీ క్యాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలో ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.. మే ఇట్ బీ డన్ టు మి అకార్డింగ్ టు యువర్ వర్డ్ అనే పదాలతో ప్రారంభమయ్యే ఈ థీమ్‌సాంగ్ ఇప్పటికే రిహార్సల్స్ పూర్తిచేసుకుంది. దీనిని ఇండియాకు చెందిన అబ్దీల్ జైమేనేజ్ కంపోజ్ చేసి పాడాడు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా వాయించే బ్యాండ్ ఇండియాలోనే రూపుదిద్దుకోవడం మరో విశేషం.

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles