పద్యనీతి


Thu,February 28, 2019 11:00 PM

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయగ నుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ ॥


యోగి వేమన

Padyneeti
పట్టుదలతో ప్రతిరోజూ ప్రయత్నిస్తే రాగయుక్తంగా, అత్యంత రమణీయంగా పాట పాడగలం. ఎలాగంటే, వేపాకును నమలగా, నమలగా కొన్ని రోజులకు అలవాటై దాని రుచి తియ్యగా మారినట్లు. ఇదే రకంగా, ఎంతటి పనినైనా సాధనతో నెరవేర్చుకోగలమని వేమన శతకకారుడు ఎంతో ఉపయుక్తమయ్యే నీతిని ఈ పద్యం ద్వారా అత్యంత సరళంగా చెప్పారు.


కేసీఆర్ వినిపించిన వేమన నీతిపద్యం!

Padyneeti-kcr
రాజకీయాలలో కూడా జీవన విలువలను, నీతి నియమాలను తాము పాటిస్తూ, తోటివారికి వినిపించే ఉత్తమ సంప్రదాయాన్ని మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నెలకొల్పారు. ఆయన ప్రసంగం వినడానికి ప్రజలు, సభికులు ఉత్సాహ పడడం వెనుక ఉన్న రహస్యాలలో ఇదొకటి. నీతి పద్యాలనగానే ఉపాధ్యాయులే చెప్తారనుకుంటాం. అవి వినడానికే కానీ, పాటించడానికి పనికిరావనీ అనుకొంటాం. కానీ, ఇందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ ఆచార్యుని పాత్రలో అనేక మంచి మాటలు చెబుతుంటారు. సందర్భోచితంగా పద్యాలు చదివి వినిపించడం ద్వారా ఒక మంచి వాతావరణాన్ని రాజకీయాలలో వారు నెలకొల్పారు. రిసోర్స్ పర్సన్లకు శిక్షణనిచ్చే సమావేశంలో ఫిబ్రవరి 6న కేసీఆర్ వినిపించిన పద్యాలలో ఇదొకటి. గ్రామాలలో సంస్కరణల అమలును ఒక నిరంతర ప్రక్రియగా సాగించాలని, అప్పుడు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అదొక అలవాటుగా మారుతుందని చెప్పే సందర్భంలో ఆయన దీనిని వినిపించారు.

638
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles