పద్యనీతి


Thu,January 10, 2019 10:58 PM

చదవని వాడజ్ఞుండగు
జదివిన స దస ద్వివేక చతురత గలుగుం
జదువంగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ ॥
- బమ్మెర పోతన (శ్రీమదాంధ్ర మహాభాగవతం, సప్తమ స్కంధం)

Padyaneeti
చదువుకోని వారు లోకం దృష్టిలో అజ్ఞానుల కిందే లెక్క. చదువుకుంటేనే సమాజంలోని మంచీ, చెడు తెలుసుకొనే వివేకం కలుగుతుంది. అందుకే, చదువు ముఖ్యం. నిన్ను ఆర్యులైన గురువుల దగ్గరకు పంపి చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా.. అని ప్రహ్లాదునికి అతని తండ్రి హిరణ్యకశిపుడు నీతిబోధ చేసిన సందర్భలోనిదీ పద్యం.

772
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles