పద్యం నేర్చుకొందాం


Fri,February 22, 2019 01:16 AM

సీ. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జన జేసి విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మఱుగైన భూమి లోపలబెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తే. తుదకు దొంగలకిత్తురో? దొరల కవునో?
తేనెజుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణ వికాస! శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ! దురితదూర!
- శేషప్ప కవి, (శ్రీ నారసింహ శతకం)

Padyam-Nerchukundam

నీతి, స్తుతి కలగలిసిన పద్యం

మాజీ డీజీపీ పేర్వారం రాములు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అప్పట్లో జరిగిన ఒక ఛాయాచిత్ర ప్రదర్శన సందర్భంగా తన ప్రసంగంలో భాగంగా వినిపించిన పలు పద్యాలలో ఇదీ ఒకటి. ఆయనకు కంఠస్థమైన పద్యాలు ఎన్నో. శేషప్ప కవి విరచితమైన శ్రీ నారసింహ శతకంలోని ఈ పద్యమంటే ఆయనకెంతో ఇష్టం. ఇందులో నీతిని, స్తుతిని కవి కలగలిపిన తీరు అద్భుతం. మరి, పాఠకులారా! మీకూ..ఇలాంటి పద్యాలు కంఠస్థంగా వస్తే, ఇటీవలి కాలంలో ఎక్కడైనా వేదికపైన చదివి వుంటే, వెంటనే మాకు రాసి పంపండి.

717
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles