పదకొండేళ్లకే సీఈఓ!


Sat,September 1, 2018 11:05 PM

ఈ పాపని నల్లగా ఉందని అంతా హేళన చేసేవారు. డార్క్ చాక్లెట్ అంటూ ఆట పట్టించేవారు. తన స్నేహితులే అవమానిస్తుంటే భరించింది. అందరిలాగే కృంగిపోయింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో బాధను సంతోషంగా మలుచుకున్నది. చిన్నవయసులోనే ఓ సంస్థకు సీఈఓగా డబ్బులు సంపాదిస్తున్నది.
kherin
అమెరికాకు చెందిన ఖెరిన్ రోజర్స్ పుట్టుకతోనే నల్లగా జన్మించింది. స్కూల్‌కి వెళ్తే అందరూ ఆమెను చూసి నవ్వేవారు. డార్క్ చాక్లెట్ అంటూ ఆట పట్టించేవారు. దీంతో నల్లగా పుట్టడమే తన శాపమా? అని రోజూ బాధపడేది ఖెరిన్ రోజర్స్. ఇలా ఎన్నో రోజులు అవమానాలు భరించింది. కొద్ది రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇది గమనించిన ఖెరిన్ కుటుంబ సభ్యులు.. ఆమెను బాగా ప్రోత్సహించారు. నీలాగే నేను ఎన్నో బాధలను అనుభవించాను. అవన్నీ ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయ్ అని సలహా ఇచ్చింది తన బామ్మ. ఇక అప్పట్నుంచి ఎవరేమన్నా కాంప్లిమెంట్స్‌గా తీసుకునేది. తనకంటూ ఒక గుర్తింపు కావాలనుకొని, ఆటలు, పాటలు, నాటికలు, డ్యాన్స్‌లతో చురుగ్గా పాల్గొనేది. ఈ క్రమంలోనే ఫ్లెక్సిన్ మై కాంప్లెక్షన్ పేరుతో ఒక వెబ్‌సైట్ ద్వారా దుస్తులను అమ్మడం ప్రారంభించింది.


అలా మొదలైన ఖెరిన్ ప్రస్థానం సీఈఓ స్థాయికి ఎదిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పది వేలకు పైగా టీ షర్ట్స్‌ను తన వెబ్‌సైట్ ద్వారా అమ్మింది ఖెరిన్. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా అడుగు పెట్టి అందరి ప్రశంసలను అందుకుంటున్నది. ఎప్పటికైనా సొంతంగా ఓ పెద్ద స్టోర్ ప్రారంభించాలన్నదే కోరిక. వీటితో పాటుగా పెద్ద మోడల్ కావాలని కూడా కలలు కంటున్నది. నల్లగా ఉన్న వారు బాధపడకుండా అద్దం ముందు నిల్చొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి అంటూ ఎందరికో ధైర్యం చెప్తున్నది ఈ బుల్లి సీఈఓ. ఖెరిన్‌ను హేళన చేసినవారు ఆమెను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదువుకుంటున్నారు.

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles