పడిలేచిన కెరటం!


Sun,March 10, 2019 12:29 AM

ఉలి దెబ్బలు తిన్న శిల అందమైన శిల్పంగా మారినట్టు.. భర్త పెట్టే బాధలన్నింటినీ భరిస్తూ, తన గమ్యాన్ని చేరుకున్నదీ మహిళ. ప్రతి కూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకొని పడిలేచిన కెరటంలా ఆదర్శంగా నిలుస్తున్నది.
singlemomindia
చంఢీగడ్‌కు చెందిన 37 యేండ్ల మమత ఖాకు ఉన్నతంగా చదువుకోవాలని చిన్నప్పటి నుంచి ఆశ. అప్పుడు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో పెద్దగా చదువుకోలేక పోయింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కొన్నాళ్లు ప్రైవేటు స్కూల్లో చేర్పించారు. కొద్దిరోజుల తర్వాత ఫీజులు కట్టలేక మళ్లీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. అలా మమత ఖా 12వ తరగతి వరకే చదివి.. ఆ తర్వాత ఆపాల్సి వచ్చింది. తర్వాత కల్‌కత్తాకు చెందిన ఓ వ్యక్తితో పెండ్లి జరిగింది. పెండ్లి జరిగిన కొన్నాళ్లకే భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూనే చదువును కొనసాగించింది. భర్తతో గొడవలు పడుతూనే కాలేజీ చదవులు పూర్తి చేసింది. మమతకు కొడుకు పుట్టిని తర్వాత భర్త వదిలేశాడు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా మిషన్ కుడుతూ, పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ డబ్బులు సంపాదించింది. ఈమెకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ సాయంతో హమారీ కక్ష్య అనే స్వచ్ఛంద సంస్థలో చేరింది. ఆ సంస్థ ఫౌండర్ అనురాధ ప్రోత్సాహంతో పీజీ చేసి, మంచి ఉద్యోగం సంపాదించింది. తనలా కాకుండా.. కొడుకును ఉన్నతంగా చదివించాలని.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇలా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. అన్నింటినీ భరించి తన లక్ష్యాన్ని చేరుకున్నది మమత ఖా.

280
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles