పట్టు పట్టింది.. ఐపీఎస్ అయింది!


Mon,February 4, 2019 01:27 AM

ఏదైనా సాధించాలంటే కృషి తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు. విజయం సాధించడానికి షార్ట్‌కట్‌లూ ఉండవు. అచ్చం అలాగే పేదరికాన్ని జయించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఐపీఎస్‌గా ఎంపికైంది ఇల్మా అఫ్రోజ్..
ilma-afroz
ఆమె ప్రతిభకు పేదరికం అడ్డం కాలేదు. ఆమె ఆశయం, కష్టం ముందు విజయం తలవంచింది. పుట్టింది పేదకుటుంబంలోనే. సాధారణ రైతు కుమార్తెనే. అంతకు మించి 14 యేండ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయిన బాధ. ఒంటరైన తల్లి. ఎదగాల్సిన సోదరుడు ఇవ్వన్నీ ఆమెలో విజయానికి పునాది రాయి వేశాయి. ఇంటర్ వరకు స్థానిక కళాశాలలో చదివింది. డిగ్రీ విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. అక్కడే తత్వశాస్త్రంలో పట్టాసాధించింది. అక్కడితో ఆగకుండా ఆమె ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించింది. మాస్టర్స్‌ని అక్కడే పూర్తి చేసింది. అయితే ప్రజలకు సేవ చేయాలని అప్పుడే తను నిర్ణయించుకుంది. సెలవుల సమయంలో ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్లు తమ ఇంటికి వచ్చి మాట్లాడేవారు. చిన్న చిన్న సాయం అడిగేవారు. వాళ్లను చూసినప్పుడు ఇలాంటి వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. మళ్లీ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు తను రోజూ కాలేజీకి వెళ్తే ఇండియా గురించి ఆలోచించేది. ఇంటిదగ్గర అమ్మా, సోదరుని పరిస్థితిని ఊహించుకునేది. పేదరికంలో ఉండి ఉన్నత చదవులు చదివించినందుకు తల్లిదండ్రులకు, అలాంటి వాళ్లకు అండగా నిలువాలనుకుంది. 2017లో పరీక్షలో యూపీఎస్సీలో 217వ ర్యాంక్ సాధించింది. దీంతో పోలీస్ సర్వీస్‌లోకి చేరింది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌లో చోటు సాధించింది. నా తల్లి నా చదువుకోసం డబ్బులు పోగేసేది, కష్టపడాలని ఎప్పుడూ చెప్పేది. నా సోదరుడు నా పెండ్లి కోసం ఎలాంటి డబ్బులు పోగుచేయడానికి బదులుగా వాటిని నా చదువుల కోసం ఇచ్చాడు. అందువల్లే నేను సాధించగలిగాను అంటున్నారు ఇల్మా.

1415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles