పండ్లు ఎప్పుడు తినాలి?


Mon,February 18, 2019 01:07 AM

పండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అవే పండ్లు ఎప్పుడు పడితే అప్పుడు తింటే అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. మరి పండ్లు ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో తెలుసుకోండి..
fruits
-అన్నం తిన్న తర్వాత పండ్లు తినడం కంటే అన్నం తినే అరగంట ముందో లేక భోజనం తర్వాత అరగంటకో పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
-అదే విధంగా మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు బట్టతో తుడిచి లాగించేస్తే విపరీతమైన బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది. అందుకని శుభ్రంగా కడిగిన తర్వాతే పండ్లు తినాలి.
-వ్యాయామానికి ముందు పండ్లు తీసుకుంటే శరీరం అలిసి పోకుండా ఉంటుంది.
-పండ్లముక్కలపై ఉప్పు చల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పులుపు ఉన్న పండ్లపై ఉప్పు చల్లుకుని తింటే అజీర్ణ సమస్యలు రావు. మధుమేహ సభ్యులు ఇలా పండ్లపై ఉప్పు చల్లుకుని తీసుకోకూడదు.
-కొందరికి ఎంత తిన్నా ఆకలవుతూనే ఉంటుంది. కర్బూజ, పుచ్చకాయల్లాంటి పండ్లు తింటే ఆకలి అదుపులో ఉంటుంది.

1657
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles