పంటి నొప్పికి ఉపశమనం ఇలా!


Thu,February 7, 2019 01:39 AM

పంటి నొప్పితో బాధపడేవారికి ఒక్కచోట ఉండాలనిపించదు. ఏమీ తినాలనిపించదు. చల్లని నీరు తాగాలన్నా ఇబ్బందే.. చివరకు మాట్లాడాలన్నా చిరాకు వస్తుంది. మరికొందరికి మొహం వాచిపోతుంది. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పి నుంచి బయట పడొచ్చు.
teeth-pain
-ఉల్లిగడ్డను ముక్కలుగా చేయాలి. ముక్కలను నొప్పిగా ఉన్న చిగుళ్ల వద్ద ఉంచితే పంటి నొప్పి నుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు.
-లవంగాలు, కొబ్బరినూనె, మిరియాల పొడి, ఉప్పు అన్నింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పిగా ఉన్న పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయమవుతుంది.
-జామ ఆకులో యాంటీ ఇన్ఫ్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పంటి నొప్పితో బాధపడేవారు 2, 3 జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి తింటే ఉపశమనం లభిస్తుంది.
-తాజా పండ్లు ఎక్కువగా తినాలి. క్యాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. పిల్లలకు చెరుకు లాంటి నమిలే పదార్థాలు పెట్టడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి.
-ప్రతిరోజూ టిఫిన్‌కి ముందు, రాత్రి ఆహారం తీసుకున్నాక బ్రష్ చేయాలి. అంటే రోజుకి రెండుసార్లన్నమాట. ఇలా చేస్తే పంటిలో ఇరుక్కుపోయిన ఆహార కణాల ద్వారా పళ్లు పాడవ్వకుండా ఉంటాయి.
-బ్రష్ చేసి నోటిని శుభ్రపరిచేటప్పుడు చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని వాడాలి. ఇలా చేస్తే నోటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

770
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles