నోమోఫోబియా.. క్యా కియా?!


Tue,January 8, 2019 11:00 PM

phone-addiction
వస్తువుల్ని వాడుకోవాలి.. మనుషుల్ని ప్రేమించాలని చెప్పే మనుషులే ఆ వస్తువుల పట్ల బానిసలుగా మారుతున్నారు. మనిషి తయారు చేసిన వస్తువులను ప్రేమించి.. ప్రేమించాల్సిన మనిషిని వదిలేస్తున్నారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా?
మనిషి రూపొందించిన అంశాల పట్ల మనిషే బాసినగా మారుతున్నాడు. నోమోఫోబియా బారినపడుతున్నాడు. కొత్తగా ఈ నోమోఫోబియా ఏంటనుకుంటున్నారా? నోమోఫోబియా అంటే.. మొబైల్ ఫోన్‌ను ఉపయోగింయలేమేమో అనే ఆందోళన పడడం. దీన్ని స్మార్ట్‌ఫోన్ సెపరేషన్ యాైంగ్జెటీ అని కూడా పిలుస్తారు. దీన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా కేంబ్రిడ్జి డిక్షనరీ పేర్కొన్నది. ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్‌లకు ప్రజలు చాలా వ్యసనమమ్యారు. ఇక యువత విషయం అయితే చెప్పనక్కర్లేదు. టెక్నాలజీని మనం కంట్రోల్ చేస్తున్నామా? టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తున్నదా అన్నంతంగా వాడేస్తున్నాం. ముఖ్యంగా యువత భోజనం చేసేటప్పుడు, కుటుంబంతో కబుర్లు చెప్పేటపుపడు కూడా ఫోన్ వదలడం లేదు. అనవసర సమయాల్లో కూడా వాటిని ఉపయోగించడం ఇలాంటి నష్టాలను దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ముఖ్యంగా నోమోఫోబియా వల్ల సమయం వృథా అవడమే కాకుండా అనుబంధాలు కూడా దూరమవుతున్నాయి. అయితే ఈ ఫోబియా తగ్గడానికి కొన్ని అంశాలున్నాయి. వాటిని పాటిస్తే కొంతమేరకు తగ్గించవచ్చు. ఫోన్‌కి టైమింగ్స్ సెట్ చేసుకొని ఆ సమయంలోనే దాన్ని వాడితే బాగుంటుంది. అత్యవసర కాల్స్ తప్ప టైమ్‌పాస్ కాల్స్‌కి దూరంగా ఉంటూ మాటిమాటికీ చెక్ చేసుకోకుండా ఉంటే మంచిది. రాత్రిపూట మంచం మీద, దిండు పక్కన కాకుండా కొంత దూరంలో, వేరే గదిలో కానీ పెట్టడం ఉత్తమం. ఛార్జింగ్ లేకపోవడం, ఫోన్‌లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు, ఫోన్ అందుబాటులో లేనప్పుడు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇదంతా నోమోఫోబియానే. దీని నుంచి బయటపడితే బాగుంటుంది. లేకపోతే ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. నోమోఫోబియా మీద ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నింటిలోనూ ఎక్కువశాతం అది 18-30 సంవ్సతరాల వయసుగల వారికే ఉందని తేలింది.

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles