నొప్పిలేకుండా.. గుర్తిస్తుంది!


Mon,December 24, 2018 01:17 AM

ప్రతీ ఏడాది 436 మిలియన్ల ఆడవాళ్లు సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. వ్యాధి ముదిరిన తర్వాతి కంటే ముందే గుర్తించాలని నొప్పి లేని ఓ పరికరాన్ని కనుగొన్నది డాక్టర్ నిమ్మి రామానుజం.
Pocket-Colposcope
2016 నేషనల్ హెల్త్ పోర్టల్ చేసిన సర్వే ప్రకారం 15యేండ్లు దాటిన మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తేలింది. సుమారు 74వేల మంది ప్రతీ సంవత్సరం ఈ వ్యాధితో చనిపోతున్నట్లు కూడా ఈ సర్వే చెబుతున్నది. అందులో 17శాతం చావులు 30 నుంచి 69 యేండ్ల మహిళలదేనట. రోజురోజుకీ ఈ వ్యాధి భారతదేశమంతా వ్యాప్తి చెందుతూనే ఉంది. 20 యేండ్ల తర్వాత నుంచే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలు బయటపడేసరికి ఆ మహిళ వయసు 50కి వచ్చేస్తున్నది. దాంతో దాన్ని నయం చేసే అవకాశం లేకుండా పోతుందన్నది డాక్టర్ల వాదన. అయితే ఇప్పటిదాకా ఈ టేస్ట్‌కి వాడే పరికరాల వల్ల భరించలేని నొప్పి కలిగేది. అలా అవ్వకుండా చాలా చిన్న మెషీన్‌తో, తక్కువ ఖర్చుతో ఈ వ్యాధి నిర్ధారణ చేసే పరికరాన్ని కనిపెట్టింది డాక్టర్ నిమ్మి రామానుజం. ఈమె డ్యూక్ యూనివర్సిటీలో గ్లోబల్ ఉమెన్స్ హెల్త్‌కి డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నది.

ఈ పరికరాన్ని లాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి వెంటనే స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుందంటున్నది నిమ్మి. ఈ డాక్టరమ్మ తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడి హెల్త్ కేర్ సెంటర్‌లో ఈ డివైజ్‌ని వాడేలా ఒప్పందం కుదుర్చుకుంది. హెల్త్ వర్కర్స్‌కి ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలన్నది దగ్గరుండి శిక్షణ ఇస్తున్నది నిమ్మి. ఒకవేళ వాళ్లకి సర్వైకల్ క్యాన్సర్ ఉందంటే వెంటనే ట్రీట్‌మెంట్ చేసి తగ్గించొచ్చన్నది ఆమె ఆలోచన. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ డివైజ్‌ని ప్రవేశపెట్టాలని దేశంలోని ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నది. అవి కనుక సఫలమైతే నిమ్మి మరింతమందిని కాపాడిందవుతుంది.

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles