నేడు, రేపు.. ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో..


Sat,February 2, 2019 12:07 AM

proparty
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్.. ఎస్‌బీఐ బ్యాంకుతో కలిసి నేడు, రేపు ఉప్పల్ డిపో చేరువలోని మహారాజా ఫంక్షన్ హాల్‌లో ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నది. శనివారం ఉదయం జరిగే ప్రారంభోత్సవానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రెరా ఛైర్మన్ రాజేశ్వర్ తివారీ, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డిలు పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో దాదాపు ముప్పయ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈస్ట్ హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారికి ఇదో చక్కటి అవకాశమని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అంటున్నది.

- తూర్పు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పలువురు బిల్డర్లు, డెవలపర్లు చేపడుతున్న వెంచర్లు, అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ప్రాపర్టీ షోలో లభిస్తాయి. ఉప్పల్, బోడుప్పల్, నారపల్లి, పోచారం, ఘట్‌కేసర్, రాంపల్లి, అన్నోజిగూడ, పీఅండ్‌టీ కాలనీ వంటి ప్రాంతాల్లో నిర్మాణ పనుల్ని జరుపుకుంటున్న అపార్టుమెంట్ల వివరాలను ఈ ప్రదర్శనలో సందర్శకులు తెలుసుకోవచ్చు. ఘట్‌కేసర్, యాదాద్రి, ఆలేరు వంటి ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న వెంచర్ల వివరాలను కనుక్కోవచ్చు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, వైటీడీఏ వంటి సంస్థల నుంచి అనుమతి లభించిన వెంచర్లకు ఎస్‌బీఐ గృహరుణం కూడా మంజూరు చేస్తుంది. కాబట్టి, ఈ అవకాశాన్ని ఇండ్ల కొనుగోలుదారులు వినియోగించుకోవాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ జక్కా వెంకట్‌రెడ్డి కోరారు. ఈ రెండు రోజుల ప్రదర్శనకు దాదాపు పదివేలకు పైగా సందర్శకులు విచ్చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

367
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles