నెట్‌వర్క్‌ స్లోగా ఉందా?


Tue,April 16, 2019 11:45 PM

ఇప్పుడందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు మిలమిలా మెరుస్తున్నాయ్‌! ఒక్కొక్కరూ ఒక్కో నెట్‌వర్క్‌ వాడుతుంటారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అలాంటి వారి కోసం ఈ చిట్కాలు..
4G
-మీ నెట్‌వర్క్‌ స్లోగా ఉందా? 4జీ స్పీడును అందుకోలేకపోతుందా? అయితే.. ముందుగా మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. మొబైల్‌ నెట్‌వర్క్‌ అనే ఆప్షన్‌లో 4జీని ఆప్షన్‌ని ఆన్‌ చేయండి. నెట్‌వర్క్‌ స్పీడ్‌ 3జీ నుంచి 4జీ పెరుగుతుంది. ఇది కేవలం 4జీ మొబైల్స్‌ వాడేవారికి మాత్రమే.
-మీ ఫోన్‌లోని యాక్సెస్‌ పాయింట్‌ నేమ్‌ (ఏపీఎన్‌)ను ఓ సారి చెక్‌ చేసుకోండి. నెట్‌వర్క్‌ స్పీడ్‌ పెరగడానికి నెట్‌వర్క్‌కి తగిన ఏపీఎన్‌ సమాచారాన్ని సెలక్ట్‌ చేసుకోండి.
-ఏపీఎన్‌ను రీసెట్‌ చేస్తే నెట్‌వర్క్‌ స్పీడు పెరుగుతుంది.
-ఫోన్‌లో వాడే కొన్ని యాప్స్‌ వల్ల కూడా ఫోన్‌, నెట్‌వర్క్‌ స్పీడు తగ్గిపోతుంది. అలాంటి యాప్స్‌ని గుర్తించి వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేసేయండి.
-యాప్స్‌ ఆటోప్లే సెట్టింగ్‌ని ఆఫ్‌లో ఉంచండి. ఇది మీ నెట్‌వర్క్‌ బ్యాండ్‌ విడ్త్‌ వాడకాన్ని తగ్గిస్తుంది. అవసరం లేని డేటా వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో నెట్‌వర్క్‌ స్పీడ్‌ కనీసం 10 ఎంబీపీఎస్‌ వరకు పెరుగుతుంది.

1511
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles