నూతన అధ్యయనం ఉదయం చేస్తే ఉత్తమం


Thu,January 24, 2019 11:52 PM

ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఏ సమయంలో చేస్తున్నారో చూడండి. ఏ సమయంలో చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది? అనే అంశం మీద ఓ అధ్యయనం చెప్తున్న ఆసక్తికరమైన విశేషాలు..
flight_tickets
ఆదివారం ఉదయం ఐదు గంటలకు ైఫ్లెట్ టికెట్స్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకు వస్తాయట. ట్రావెల్ బుకింగ్ సైట్ స్కై స్కానర్ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. విమానాల రాకపోకలు, వాటి టికెట్లు ఏ సమయంలో బుక్ చేసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి వంటి అంశాలపై అధ్యయనం చేశారు. వాస్తవానికి రోజు, తేది, సెలవులను బట్టి విమాన టికెట్ల రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఆ సమయంలో కూడా కొంత డిస్కౌంట్ లభిస్తుంది. అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వాళ్లు అయిదు నుంచి ఆరు నెలల ముందు చేసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు వెళ్లాలనుకునే వాళ్లు జనవరి, ఫిబ్రవరి నెలల్లో టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకు టికెట్లు లభిస్తాయని కూడా ఈ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలల్లో అంతర్జాతీయ ట్రిప్పులు పెట్టుకుంటే టికెట్లు తక్కువకు దొరుకుతాయట. ట్రావెల్ చేయాలనుకునే వాళ్లు సమయం, సందర్భం చూసుకొని ముందే టికెట్లు బుక్ చేసుకుంటే బాగుంటుంది.

350
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles