నీ జీను ప్యాంట్ చూసి పిల్లోడా..


Fri,February 22, 2019 01:38 AM

క్యాజువల్‌గా.. ఫార్మల్‌గానైనా.. ఆడుతూ.. పాడుతూ తిరిగే పిల్లలకు.. క్లాస్‌గా.. కంఫర్ట్‌నిచ్చేవి జీన్స్‌లే! వాటి మీదకి టీషర్ట్‌లు.. షర్ట్‌లు.. మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ.. సూపర్ స్టయిల్‌గా రెడీ చేయొచ్చు.. మగపిల్లలకి ప్రత్యేకమైన ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవి..
Fashan
1. బ్లూ టోన్ జీన్స్ చాలా కూల్‌గా కనిపిస్తున్నది. దీనికి డార్క్ బ్లూ, సీ బ్లూ కాంబినేషన్‌లో లైన్స్ వచ్చిన టీ షర్ట్ బాగా సూటయింది. ైస్టెలిష్‌గా ఉండేందుకు ఎర్రని టై యాడ్ చేశారు.

2. బ్లాక్ కలర్ కాటన్ జీన్స్ ఇది. దీనికి యెల్లో కలర్ ఫార్మాల్ షర్ట్‌ని మ్యాచ్ చేశారు. దీనిపైన బ్లూ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్, బ్లూ జీన్స్ బౌ డ్రెస్ అందాన్ని రెట్టింపు చేసింది.
Fashan1
3. డిఫరెంట్ కలర్స్ ట్రై చేయడం పిల్లలకు మరింత అందాన్ని తీసుకొస్తుంది. పీకాక్ బ్లూ షేడెడ్ జీన్స్ ఇది. దీనికి సెల్ఫ్ ప్రింట్ యెల్లో, పీకాక్ బ్లూ షేడ్ కాంబినేషన్‌తో సూపర్‌గా మ్యాచ్ అయింది.

4. బ్లూ టోన్ జీన్స్ కాస్త షేడెడ్‌లో వచ్చింది. దీనికి బ్లాక్ కలర్ టీషర్ట్, దానిపై వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో వచ్చిన చెక్స్ షర్ట్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. 3/4స్లీవ్స్, నెక్ నుంచి స్లీవ్స్ వరకు వచ్చిన పట్టి దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది.

878
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles