నిర్మలమైన లోపలిమెట్లు


Sat,September 20, 2014 02:55 AM

నిర్మలమైన ఒరవడితో సాగిన కవిత్వమిది. గులకరాళ్లు, ప్రవాహానికి స్వచ్ఛతను చేకూర్చినట్లే జీవితానుభవాలు, సామాజికానుభవాలే ఈ కవితాసంపుటికి మూలం

nirmalaఊహలకు ఆలోచనల రూపు ఇవ్వగలిగే వయసు వచ్చినప్పటి నుంచి కవితలను డైరీల్లో రాసుకొని దాచుకోవటం అలవాటు చేసుకుంది నిర్మలరాణి తోట. తెలంగాణలో కవయిత్రులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు అని కొందరు భావిస్తుంటారు. అది ఒకప్పుడు.. గుర్తింపు రాకుండా నాలుగు గోడల మధ్య ఉన్న కవయిత్రుల సంఖ్య ఇప్పుడు చాలా పెరిగింది అంటున్న నిర్మల తన లోపలి మెట్ల గురించి ఇలా చెప్పింది.
మాది కరీంనగర్ కాపువాడ. వృత్తిరీత్యా విద్యుత్‌శాఖలో ఉద్యోగం. ప్రవృత్తి మాత్రం కవితలు రాయడం. లోపలి మెట్లు నా మొదటి కవితా సంపుటి.

నాలోని సున్నిత భావాలను, ప్రతిస్పందనలను కవితలుగా మలిచి రాసిన కవితలు ఇవి. పుస్తకంలో వచనా కవిత్వంతో పాటు స్త్రీ సమస్యలు, మానవ సంబంధాలపై కవితలు ఉన్నాయి. లోపలిమెట్లు అంటే అర్థం అంతరంగపు మెట్లు అని. జీవితంలో ఎదగాలంటే ఎన్ని మెట్లు ఎక్కినా.. అంతరంగపు మెట్లు ఒక్కొక్కటిగా దిగాలనే అంశం ఈ పుస్తకంలో ఉంది. నేను చిన్నప్పుడే నాటికలు, ఏకపాత్రాభినయం చేశాను. ఒక పత్రికలో వచ్చిన కవిత నచ్చి కవిపేరు, ఫోన్‌నెంబర్ చూసి నాలుగు వాక్యాలు మెసేజ్ చేశాను. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. నన్ను కవయిత్రిగా నిలబెడుతుందని ఊహించలేదు. ఆ కవి నన్ను ఫేస్‌బుక్‌లోని కవి సంగమంలో జాయిన్ చేశారు. డైరీల్లో రాసుకునే వ్యక్తిగత కవిత్వం కాక సామాజిక దృక్పథంతో కవితలు రాయాలని కొందరు కవులు సూచించారు. ఆ కవుల ప్రోత్సాహం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. లోపలిమెట్లు సమాజాన్ని నిశితంగా గమనిస్తున్న స్త్రీ అంతరంగపు మెట్లు.

అరువు తెచ్చుకున్న ఆనందాల్లో కొనుక్కొచ్చుకున్న అనుబంధాల్లో చీకటి వెలుగుల మధ్య నీడల్ని మోస్తూ
మనిషికి మనసుకూ మధ్య గోడల్ని కడుతూ వెలుగుల్లో కళ్లు మూసుకొని చీకట్లో కళ్లు పొడుచుకొని బతుకుతున్నామని భ్రమిస్తున్న మనం అవసరార్థ అద్వైతంలో అబద్ధపు పాత్రదారులం

669
Tags

More News

VIRAL NEWS