నల్లటి వలయాల నివారణ ఇలా?


Mon,January 14, 2019 01:31 AM

అధిక ఒత్తిడి కారణంగా నల్లటి వలయాలు ఏర్పడుతాయి. కంటికి కొంత ఉపశమనం దొరికితే చాలు సమస్య తొలిగించవచ్చు. ఈ కింది చిట్కాలను పాటిస్తే కంటికి కావాల్సినంత ఉపశమనం దొరుకుతుంది.
skincare
-తాజా కొబ్బరినూనె తీసుకోవాలి. దీన్ని నిద్రించే ముందు కంటి కింద నల్లటి వలయాలకు రాస్తూ ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడుగాలి. రోజూ ఈ విధంగా పాటిస్తే నల్లటి వలయాలు తొలిగిపోతాయి.
-కీరదోసని ముక్కలుగా కట్‌చేసి నిమ్మరసంలో ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత ముక్కలను కంటిమీద పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసేస్తే సరిపోతుంది. రోజూ ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి కళ్లకి ఉపశమనం లభిస్తుంది.
-టీ బ్యాగ్‌ను కొంచెంసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. బాగా చల్లగా అయిన తర్వాత కంటిమీద 30 నిమిషాల పాటు పెట్టుకోవాలి. బ్యాగ్‌ని తొలిగిస్తే కంటి కింద నల్లటి మచ్చలు తగ్గడం చూడొచ్చు.
-కాటన్ బట్టను రోజ్‌వాటర్‌లో బాగా నానబెట్టాలి. బట్టను తీసి కంటిరెప్పల మీద పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత తీసేస్తే కొంతమేర ఉపశమనం లభిస్తుంది.
-పాలలో దూదిని ముంచాలి. కొంతసేపటి తర్వాత కంటి కింద నల్లటి వలయాల మీద పెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచితే పాలలోని లాక్టిక్ యాసిడ్ మచ్చలను తొలిగిస్తుంది.
-నిమ్మరసం, టమాట గుజ్జుని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని కంటి కింద రాయాలి. 10 నిమిషాల తరువాత నీటితో కడుగాలి.

782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles