నడిచే కారు వచ్చేసింది!


Wed,February 20, 2019 01:15 AM

అదేంటీ.. నడిచే శ్రమ తప్పించేందుకే కదా కార్లు ఉండేది. మళ్లీ కారు నడువడం ఏంటి? అని ఆశ్చర్యపోకండి. వివరాలు తెలియాలంటే పూర్తిగా చదువండి.
walking-car
ఖరీదైన కార్లు తయారుచేసే హుందాయ్ సంస్థ సరికొత్త రొబోటిక్ కారును తయారుచేసింది. దాని ప్రత్యేకత ఏంటంటే.. ఆ కారుకు కాళ్లున్నాయి. మామూలు రోడ్ల మీద అన్ని కార్లలాగే ఇది కూడా రయ్యిమంటూ దూసుకుపోతుంది. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న ప్రదేశంలో టైర్లకు విశ్రాంతినిచ్చి కాళ్లకు పనిచేప్తుంది. రొబోటిక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కారుకు ఎగుడుదిగుడు ప్రదేశాల్లో కూడా ప్రయాణించేందుకు వీలుగా కాళ్లు అమర్చారు. ఈ కాళ్ల సాయంతో ఒకేసారి ఐదడుగుల దూరం అడుగు వేస్తూ ఐదు కిలోమీటర్లు నడువగలదు. కారు ప్రయాణించలేని రోడ్ల మీద నడుచుకుంటూ మనల్ని మోసుకెళ్తుందన్నమాట. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో నిర్వహించిన ఇటీవలి సీసీఎస్‌లో ఈ కారును హుందాయ్ కంపెనీ పరిచయం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సంఘటనా స్థలానికి వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో ఈ కారు నడుచుకుంటూ వెళ్లి బాధితులకు సహాయక చర్యలు చేయడానికి ఉపయోగపడుతుంది. శిథిలాలు, బురదలో కూడా తాపీగా నడుచుకుంటూ వెళ్లి, క్షతగాత్రులను తీసుకురాగలదు.

446
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles