నడవలేకపోతున్నా.. ఏమై ఉంటుంది?


Mon,April 15, 2019 01:01 AM

నా వయసు 60 సంవత్సరాలు. కొంతకాలంగా ఏ పనీ చేయలేకపోతున్నాను. ఏది చేసినా చాలా నెమ్మదిగా చేస్తున్నా. త్వరగా నడవలేకపోతున్నా కూడా. న్యూరోబైన్ మాత్రలు కూడా వేసుకుంటున్నా ఫలితం లేదు. నా సమస్య ఏమై ఉంటుందంటారు? నేను మామూలుగా నడవాలంటే ఏం చేయాలి?
- సుజాత, హైదరాబాద్

Councelling
మీ లక్షణాలను బట్టి చూస్తే మీది పార్కిన్‌సన్స్ వ్యాధి అని అర్థం అవుతున్నది. అరవై యేండ్లు నిండినవారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చున్నప్పుడు చెయ్యి వణకడం.. నడవలేకపోవడం.. వెనక్కి వెంటనే తిరగలేకపోవడం.. ముఖంలో కదలికలు లేకపోవడం.. నోటి నుంచి ఉమ్మి కారడం వంటి లక్షణాలు ఉంటే అది పక్కా పార్కిన్‌సన్సే. మెదడులో డొపెమైన్ కెమికల్ తగ్గిపోవడం వల్ల మనిషిలోని కదలికలు తగ్గిపోతాయి. సిండోసా, రోపాల్క్, పాసిబేన్ వంటి మందులను ఈ సమస్య పరిష్కారం కోసం వాడుతారు. మెడిసిన్స్ పనిచేయకపోతే డీబీఎస్ సర్జరీ ద్వారా సమస్యను పరిష్కరింపచేయవచ్చు. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవవచ్చు.
Dr.Muralidhar

570
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles