నకిలీ ముఖాలు


Tue,February 5, 2019 12:41 AM

Namoona-Shastram
జపాన్‌లోని ఒక చిన్న కంపెనీ తయారు చేస్తున్న వాస్తవికమైన మాస్క్‌లు అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకొంటున్నాయి. అసలును మించిన నాణ్యత వీటిలో కనిపిస్తుండడం ఆశ్చర్యమే మరి.


కొత్తగా సృష్టించడమంటే కష్టమేమో కానీ కాపీ కొట్టడమైతే ఎంతో ఈజీ కదా! అనుకొనే వారు కూడా ఆశ్చర్యపడేలా అసాధారణ నాణ్యతతో నకిలీ ముఖాలను తయారు చేస్తున్న ఒక చిన్న జపాన్ కంపెనీ సంచలనం సృష్టిస్తున్నది. రియల్- ఎఫ్ కో (REAL-f Co.,) పేరుతో కేవలం అయిదుగురు ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ సృష్టిస్తున్న నకిలీ ముఖాలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. వీరు తయారు చేస్తున్న మాస్క్‌లు ఎంత కచ్చితత్వంతో వుంటున్నాయో ఈ డిమాండే చెబుతున్నది. అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రంలోని త్రిమితీయ ముఖ సమాచారాన్ని సేకరించి లక్క, ప్లాస్టిక్‌లతో ఈ మాస్కులను తయారు చేస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు ఒసాము కిటగావా తెలిపారు. 2011లోనే మొదలైన వీరి మాస్కుల తయారీ ప్రక్రియ ప్రస్తుతం ఏడాదికి 100 ఆర్డర్లకు చేరింది. టెక్, కారు కంపెనీలకే కాక భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోలకూ వీటి అవసరం వుంటుందని, ఈ మేరకు సిలికాన్ వంటి పదార్థాలతో వాటి తయారీకి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

183
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles