ద్రవపదార్థాలతో ధూమపానం మానొచ్చు!


Wed,May 31, 2017 12:13 AM

lung-cancer
మనదేశంలో పొగాకు వాడకం వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి ముఖ్యకారణం ఇదే. పొగాకులో ఉండే కార్సినోజెనిక్ రసాయనాలు ఒక్కసారి పొగతాగినా ఊపిరితిత్తుల్లో మార్పులు తీసుకొస్తాయి. ఈ మార్పులు బయటపడి, వ్యాధి నిర్ధారణకు చాలా సమయం పడుతుంది. సాధారణంగా 55 నుచి 65 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బయటపడుతుంది.

పొగతాగనివారితో పోలిస్తే పొగతాగేవారిలో ఊపిరితిత్తుల పనితీరు తక్కువగా ఉంటుంది. ధూమపానం చేస్తున్నంత కాలం ఊపిరితిత్తులు శిథిలమవుతూ ఉంటాయి. దీనివల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు.. తీవ్రమైన బ్రాంకైటిస్, ఎంఫిసెమా వంటి రోగాలు కూడా వస్తాయి. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ధూమపానం చేసేవారిలో 90 శాతం మంది పురుషులు, 80 శాతం మంది స్త్రీలు క్యాన్సర్‌కు గురవుతున్నారు.

ఎలా మానేయాలి?


-హెరాయిన్, కొకైన్ లాగా పొగాకులోని నికోటిన్ కూడా ఒక అడిక్టివ్. కాబట్టి ముందుగా ధూమపానం మానేయాలనే దృఢ సంకల్పం అవసరం.
-పొగాకు మానేయాలనుకుంటే కొన్ని రోజులు నీరు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటి ద్వారా శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
-పొగాకుపై కోరిక కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. తరువాత క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఆ కొద్ది నిమిషాలు సంయమనం పాటించాలి.
-మొదటి వారం పదిరోజుల్లో కాఫీ, చక్కెర, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటివల్ల సిగరెట్ కోరిక పెరుగుతుంది.
-కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం చాలా అవసరం.
-పొగాకు మానినప్పుడు నికోటిన్ లేకపోవడం వల్ల శరీర మెటబాలిక్ రేటు తగ్గుతుంది. కాబట్టి కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి.

ప్యాసివ్ స్మోకింగ్ మరింత హానికరం


మనం నేరుగా సిగరెట్ తాగకపోయినా ఇతరులు వదిలిన పొగ పీల్చడం లేదా కాలుతున్న సిగరెట్ నుంచి వచ్చే పొగను పీల్చడాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. నేరుగా ధూమపానం వల్ల ఎంత హాని కలుగుతుందో, దీనివల్ల కూడా అంతే హాని కలుగుతుంది. ప్రతి ఏటా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల 3,400 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్, 46 వేల మంది గుండె జబ్బుతోనూ చనిపోతున్నారు. ఇవేగాక ఆస్తమా, న్యుమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు లాంటివి కూడా వస్తాయి.
smoking-kills

మానేయగానే లాభమేనా?


ఆలస్యమైనా ధూమపానం మానేయడం వల్ల ఉపయోగాలుంటాయి. ధూమపానం మానేసిన కొన్ని నిమిషాల్లోనే శరీరం కోలుకోవడం మొదలవుతుంది. 20 నిమిషాల తరువాత - గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు తగ్గుతాయి.12 గంటల తరువాత - రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ శాతం సాధారణ స్థితికి వస్తుంది.
2 వారాల నుంచి 3 నెలల వరకు - రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఊపిరితిత్తుల పనితీరు బాగవుతుంది.
నెల నుంచి 9 నెలల వరకు - దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడి, శ్వాస సాధారణ స్థితికి చేరుతుంది. ఇన్‌ఫెక్షన్ల రిస్కు తగ్గుతుంది. ఊపిరితిత్తులు మ్యూకస్‌ను నియంత్రించగలుగుతాయి.
ఏడాది తరువాత - కరొనరీ హార్ట్ డిసీజ్ అవకాశం సగానికి తగ్గుతుంది.5 సంవత్సరాల తరువాత - పొగ తాగనివారిలో గుండెపోటు అవకాశాలు ఎంత తక్కువగా ఉంటాయో మానేసిన వారికి కూడా అంతే తక్కువ ఉండే స్థితి వస్తుంది.15 ఏళ్ల తరువాత - సాధారణ వ్యక్తుల్లో కరొనరీ గుండె జబ్బులు వచ్చే అవకాశం, పొగమానేసినవాళ్లలో ఉండే రిస్కు ఒకేలా ఉంటుంది.
dr.mohan

వెంటనే కలిగే లాభాలు


-ఆహారం రుచి తెలియడం
-వాసన గ్రహించే శక్తి సాధారణ స్థాయికి రావడం
-శ్వాస, జుట్టు, బట్టలు తాజా వాసన వస్తాయి.
-పళ్లు, గోళ్లు పచ్చగా మారవు.
-మెట్లెక్కేటప్పుడు, చిన్న చిన్న పనులు చేసేటప్పుడు ఆయాసం రాదు.

1527
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles