దేశరక్షణే ధ్యేయం


Wed,February 27, 2019 12:35 AM

రెండేండ్ల కిత్రం ఇండియా-చైనా సరిహద్దులో జరిపిన కాల్పుల్లో మేజర్ ప్రసాద్ గణేష్ మహదీక్ మరణించారు. తర్వాత అతని భార్య వారసత్వంగా సైన్యంలో చేరనున్నారు.
gouri
బార్డర్‌లో అలుపెరుగకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతారు సైనికులు. వారు వీర మరణం చెందినప్పుడు వారి కుటుంబ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. అలాంటి వారే మేజర్ ప్రసాద్. చెన్నైలోని ఓటిఎ శిక్షణ తర్వాత 2012లో ప్రసాద్ ఇండియన్ ఆర్మీలో చేరాడు. బీహార్ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లోని అత్యుత్తమ అధికారుల్లో మేజర్ ప్రసాద్ ఒకడు. ఒకరోజు ఉగ్రవాదులు భారత జవాన్ల నివాసాలపై చేసిన దాడిలో ఆయన మరణించాడు. ఆయన భార్య.. గౌరీ ప్రసాద్ మహదీక్. గౌరీ న్యాయవాదిగా పనిచేస్తూ 2015లో ప్రసాద్‌ని వివాహం చేసుకుంది. భర్త మరణానంతరం న్యాయవాద వృత్తిని విడిచిపెట్టింది. భర్త అడుగుజాడల్లో నడువాలనుకున్నది. పరీక్షలు రాసింది. విడో క్యాటగిరిలో జరిగిన సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఎగ్జామినేషన్ పరీక్షలో రాణించింది. ఏప్రిల్‌లో చెన్నై అకాడమీలో జరిగే 49 వారాల శిక్షణ పూర్తయిన తర్వాత ఆర్మీలో చేరనున్నది గౌరీ. నేను నాన్ టెక్నికల్ విభాగంలో నియమించబడ్డాను. రెండో అటెంప్ట్‌లో మొత్తానికి విజయం సాధించాను అని చెబుతున్నది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు భోపాల్‌లో జరిగిన ఎస్‌ఎస్‌బీ పరీక్షకు మొత్తం 16 మంది హాజరయ్యారు. అందులో గౌరీ మొదటి స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 22కి మనం స్నేహితులయి ఐదు సంవత్సరాలు పూర్తయింది. నీ ఉనికి నాకు ఇచ్చావు. నేను మేజర్ ప్రసాద్‌కి భార్యను అయినందుకు గర్వపడుతున్నానని ఫేస్‌బుక్‌లో తన భర్తను గుర్తు చేసుకుంటూ ఈ మధ్యే ఒక పోస్ట్ పెట్టింది. 2020 మార్చిలో తన భర్త యూనిఫాం, నక్షత్రాలు ధరించి లెఫ్టినెంట్ గౌరీ ప్రసాద్ మహాదిక్‌గా పేరు పొందుతానంటున్నది. ఇవి నిజమైన నక్షత్రాలకంటే బిలియన్ రెట్లు మెరుస్తాయి. ఆయనలా తను కూడా దేశానికి సేవ చేస్తానంటున్నది గౌరి!

219
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles