దుర్వాసన పోవాలంటే!


Thu,March 14, 2019 12:21 AM

వేసవి కాలానికి, చెమట కంపునకు ఆత్మీయ సంబంధం ఉంటుంది. పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసినప్పటికీ మధ్యాహ్నానికే చెమట వాసన ఇబ్బందిపెడుతుంది. ఈ సమ్మర్‌లో చెమట వాసనను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలను పాటించండి.
smell
-బకెట్ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ నీటితో స్నానం చేయండి. చెమట కానీ, చెమట వాసన కానీ మీ దరి చేరదు.
-సమ్మర్‌లో కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరానికి గాలి బాగా ఆడి శరీర దుర్వాసనను దూరం చేస్తుంది.
-టీ, కాఫీలు చెమట ఉత్పత్తికి కారకాలు. కాబట్టి చెమట వాసన నుంచి తప్పించుకోవాలంటే టీ, కాఫీలకు దూరంగా ఉండండి.
-స్నానపు నీటిలో ఉడికించిన పుదీనా ఆకులు కలిపి స్నానం చేస్తే చర్మం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
-రోజూవారి ఆహారంలో 20శాతం మాంసకృతులు, 20శాతం నూనెలు, కొవ్వులు, పండ్లు ఉంటే చెమటను అల్లంత దూరంలో ఉంచొచ్చు.
-సోంపు గింజలు నోటినే కాదు శరీర వాసనను కూడా ప్రభావితం చేస్తాయి. రోజూ ఒక స్పూన్ సోంపు గింజలు తినండి.

వంట చిట్కాలు
-పూరీలు బాగా పొంగాలంటే కొంచెం మైదాపిండి కలుపాలి.
-గారెలు రుచికరంగా ఉండాలంటే మినపపిండిలో కాస్త బియ్యపు పిండిని జోడిస్తే చాలా టేస్టీగా ఉంటాయి.
-చపాతీ పిండి కలిపేటప్పుడు నీటితో పాటు కొంచెం నూనె కలిపితే మెత్తగా, మృదువుగా వస్తాయి.
-మురుకులు కరకరలాడాలంటే పిండిలో వేడినెయ్యి కలుపాలి.

1147
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles