దురాచారాలను రూపుమాపేందుకు..


Sat,March 9, 2019 12:41 AM

మహిళలకు సమానత్వపు హక్కులు కల్పించడానికి, సామాజిక రుగ్మతల పేరుతో వారిని దూరం చేసే సనాతన దురాచారాలను రూపుమాపేందుకు ఓ వీరనారి నడుం బిగించింది.
pune
పూణెకు చెందిన చంద్రచూడ్ అనే మహిళ రెండు దశాబ్దాల నుంచి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఉద్యమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే ఆమె పెండ్లిళ్ల దగ్గర నుంచి అంతిమ సంస్కారాల వరకూ తానే పూజారిణిగా మారి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అంతేకాదు స్త్రీలకు, పురుషులకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని విషయాలలో సమాన హక్కులు ఉంటాయని చంద్రచూడ్ అవగాహన కల్పిస్తున్నది. భర్తలు చనిపోయిన మహిళలను విధవరాలిగా ముద్రవేసి శుభకార్యాలకు వారిని దూరంగా ఉంచడమేకాకుండా అవమానాలకు గురిచేస్తున్నారని చంద్రచూడ్ చెబుతున్నది. అలా లేనిపోని అవహేళనల వల్ల వారి మనసును గాయపరచడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె అంటున్నది. గార్గి ఈజ్ స్టిల్ లైవ్ అనే మరాఠి పుస్తకం చంద్రచూడ్‌లో కొత్త మార్పు తీసుకువచ్చింది. పూజారిణిగా మారి తన వంతుగా సమాజాన్ని మేల్కొల్పాలని తలచింది. వారణాసి వెళ్లి అక్కడ కర్మఖాండలు నిర్వహించే ప్రక్రియను, ఆ సమయంలో చదివే మంత్రాలు నేర్చుకున్నది.అలా నేర్చుకున్నప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 72ఏండ్ల వయసులోనూ చంద్రచూడ్ శుభ, అశుభ కార్యక్రమాలను జరిపిస్తున్నది. తన కోడలికి పౌరోహిత్యంలో శిక్షణ ఇప్పించి ఆమెనూ పూజారిణిగా మార్చేందుకు సిద్ధమైంది.

600
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles