దీర్ఘకాల మదుపరికి ఒడిదుకులే నేస్తం ఎస్‌ఐపీ అందుకు ఉత్తమ మార్గం


Sat,March 2, 2019 12:12 AM

SIP
ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనదేశం ఒకటి. దీర్ఘకాలంలో మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు మందిగిస్తున్న ఛాయలు కనిపిస్తున్నప్పటికీ, ఇతర వర్దమాన దేశాలతో పోల్చితే ఇండియా ప్రోత్సాహకర వృద్ధి రేటును నమోదు చేసింది. దేశీయ మార్కెట్‌లో డీఐఐలు బలమైన శక్తిగా ఎదిగాయి. ఎఫ్‌ఐఐల ప్రభావం గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిపోయింది. డీఐఐలు మార్కెట్‌లో లిక్విడిటీ కల్పించడంలో కీలక భూమికను పోషిస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల స్వర్గంగా ఇండియా ఎదిగింది. ఇటీవలి కాలంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా మార్కెట్‌లో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.

సరళంగా అర్థం కావడం, మదుపు చేయడంలో ఫ్లెక్సిబిలిటీ ఉండడం వంటి కారణాలతో ఎస్‌ఐపీలు ప్రజాదరణ పొందాయి. ప్రతి ఇన్వెస్టర్‌కు ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. క్రమశిక్షణ ఉంటే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సులువు అవుతుంది. మదుపు చేయడం విషయానికి వస్తే చాలా మందికి అలసత్వం ఎక్కువ. ఆ కారణంగా చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలను వాయిదా వేస్తూ వస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఎస్‌ఐపీలు కచ్చితంగా మదుపు చేసే వారిని క్రమశిక్షణలోకి తీసుకువస్తాయి. ఎస్‌ఐపీ పద్ధతిలో మదుపు చేయడం వల్ల ఇన్వెస్టింగ్‌పై నిబద్ధతను కల్పించి మిమ్ములను ఒక రెగ్యులర్ ఇన్వెస్టర్‌గా రూపొందిస్తుంది. మీరు కొనుగోలు చేసే ఎస్‌ఐపీ ఎన్‌ఏవీ ప్రతి రోజూ మారుతూ ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఒక రోజు పెరుగవచ్చు లేదా తరిగిపోవచ్చు. ప్రతినెలా ఒక నిర్ణీత తేదీన నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయడం వల్ల కొంత కాలం తర్వాత సగటున మనం కొనుగోలు చేసిన మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ధర తక్కువకే లభించినట్టవుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతూ వుంటేనే మనకు వచ్చే యూనిట్లు సగటున తక్కువకు లభించడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ చక్రగమనాలను (సైకిల్స్) ను అర్థం చేసుకోగలిగి, నష్టం వచ్చినా సరే తాను నమ్మిన విషయంతో ఓపిగ్గా వేచి చూస్తే మదుపు చేసిన మొత్తం విలువ దీర్ఘకాలానికి భారీగా పెరుగుతుంది.

ఎస్‌ఐపీలనే మదుపు సాధనంగా మీరు ఎంచుకుంటే దీర్ఘకాల రాబడులపై నమ్మకంతో ఓపిగ్గా వేచి ఉండగలిగితే ఎస్‌ఐపీలలో అంచనా వేసుకున్న రాబడులు చేతికి అందుతాయి. తాత్కిలికంగా ఎస్‌ఐపీ పెట్టుబడులు నష్టాలను చూపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలోనే మంచి రాబడులు అందిస్తాయి. ఒడిదుడుకులు క్రమేపీ తగ్గిపోయి మార్కెట్లు పెరుగడం ప్రారంభిస్తాయి. మార్కెట్లలో ఒడిదుడుకులు సహజాతంగా ఉంటాయి. మార్కెట్ల హెచ్చుతగ్గుల ఆధారంగా మన ఆర్థిక ప్రణాళిక లేదా ఆర్థిక లక్ష్యాలను పక్కన పెట్టకూడదు. ప్రతీ పతనం తర్వాత మార్కెట్లు మళ్లీ పెరుగుతాయి. దీర్ఘకాల ఇన్వెస్టర్లెవరూ మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. చరిత్రను ఒక సారి పరిశీలిస్తే ప్రతి బేర్ మార్కెట్‌లో లేదా పతనం 13 నుంచి 15 నెలలకు మించి లేదు. బేర్ మార్కెట్ కనీస స్థాయిల్లో ఎస్‌ఐపీల నుంచి బయటపడితే సంపదను సృష్టించుకునే గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నట్టే. ఒడిదుడుకుల మార్కెట్‌లో నగదును దాచుకోవడం కన్నా ఎస్‌ఐపీ ఇన్వెస్టర్‌గా ఉండడం బెటర్.

మరో విధంగా చెప్పాలంటే ఎస్‌ఐపీ ఇన్వెస్టర్‌కు మార్కెట్ ఒడిదుడుకులే పెద్ద దీవెన లాంటివి. మార్కెట్ పతనంలో మరిన్ని యూనిట్‌లను కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తాయి. అలాగే మార్కెట్ పెరుగుతున్నప్పుడు తక్కువ యూనిట్లను కొనుగోలు చేయడానికి వీలవుతుంది. మార్కెట్‌లో స్వల్పకాలిక ఇన్వెస్టర్ కన్నా దీర్ఘకాలికి ఇన్వెస్టర్ కే రాబడులు ఎక్కువగా అందివస్తాయి. మీ కాలపరిమితి పెరిగే కొద్దీ రాబడులు పెరుగుతాయని ఇటీవల వాల్యూ రీసెర్చి చేసిన అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు ఐదేండ్ల ఎస్‌ఐపీ ద్వారా 10 శాతం పైగా రాబడులు రావడానికి 63.8 శాతం అవకాశాలుంటాయి. కానీ అదే పదేండ్ల ఎస్‌ఐపీలో అవకాశాలు 77.3 శాతానికి పెరుగుతాయి.

ప్రతి ఇన్వెస్టర్ తన వ్యక్తిగత ఎమోషన్స్‌ను పక్కన పెట్టడం నేర్చుకోవాల్సి ఉంటుంది. భయం, లోభత్వం వంటి ఎమోషన్స్‌ను ఆర్థిక నిర్ణయాలు తీసుకునేముందు పక్కన పెట్టాలి. ఇన్వెస్టర్లు అంతా తప్పక పాటించాల్సిన సూత్రాలివే
1. నష్టం వస్తే భరించగలిగినంత మొత్తాన్నే మదుపు చేయాలి.
2. మార్కెట్ అన్ని పరిస్థితుల్లోనూ మదుపు చేయగలగాలి
3. దీర్ఘకాలానికి మదుపు చేయండి.
sanjay-kumar

322
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles