థైరాయిడ్ సమస్యలకు హోమియో


Wed,May 25, 2016 01:18 AM

hyperthyroidismప్రపంచ జనాభాలో సుమారు 75 శాతం స్త్రీలు, 15 శాతం పురుషులు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటారు. థైరాయిడ్ సీతాకోక చిలుక ఆకారంలో గొంతు భాగంలో ఉంటుంది.
థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు టి3, టి4 జీవక్రియల నియంత్రణలో పాలు పంచుకుంటాయి. టి3- ట్రై అయడో థైరోనిన్, టి4- థైరాక్సిన్.
థైరాయిడ్ గ్రంథిలో వాపు రావడం, పరిమాణం పెరగడం
థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడం (హైపర్ థైరాయిడిజం)
థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి కావడం (హైపోథైరాయిడిజం)
హైపర్ థైరాయిడిజం

లక్షణాలు
ఆకలి ఎక్కువగా ఉండడం, బరువు తగ్గడం
కోపం, చిరాకు, నీరసం
అలసట, ఉద్రేకం
నాడీ వేగం ఎక్కువగా ఉండడం
కాళ్లు, చేతుల్లో వణుకు
ఎక్కువ వేడిని భరించలేకపోవుట
చెమటలు
నీళ్ల విరోచనాలు
హైపోథైరాయిడిజం
నీరసం, బద్ధకం
చలి ఎక్కువగా ఉండడం
బరువు పెరగటం, డిప్రెషన్, ముఖం వాచినట్లు ఉండడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం, గొంతు బొంగురు పోవడం

కారణాలు
శరీరంలో యాంటీబాడీస్ తయారై థైరాయిడ్ గ్రంథి పనిచేయకుండా చేస్తాయి. దీనిని ఆటోఇమ్యూన్ సమస్య అంటారు. ఇది 30 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న పిల్లల్లో థైరాయిడ్ లోపాల వల్ల పెరుగుదల లోపాలు ఏర్పడుతాయి. మెదడు పెరుగుదల ఆగిపోవచ్చు.

నిర్ధారణ
రక్తపరీక్ష టి3, టి4, టీఎస్‌హెచ్ స్థాయిలు
రక్తపరీక్ష థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రా సౌండ్

చికిత్స
హోమియోపతి వైద్య విధానంలో థైరాయిడ్ సమస్యలు రావడానికి మూల కారణాలను విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి సరైన హోమియో మందులతో తత్వ విచారణ ద్వారా చికిత్స అందిస్తారు. ఇందుకు సరైన హోమియో వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
murali

1687
Tags

More News

VIRAL NEWS

Featured Articles