థైరాయిడ్ సమస్యలకు మంచి మందు


Wed,January 13, 2016 02:58 AM

thyroid

ఈనాటి జీవన శైలిలో అధిక ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహార లోపం వంటి వాటి ప్రభావం థైరాయిడ్ గ్రంథి మీద పడుతోంది.
-థైరాయిడ్ శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది గొంతు దగ్గర సీతాకోక చిలుక ఆకారంలో శ్వాస నాళానికి ఇరు పక్కలా ఉంటుంది. దీని నుంచి థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి జీవక్రియల నిర్వహణలో పాలు పంచుకుంటాయి. థైరాయిడ్ నుంచి టీ3, టి4 అనే థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.

థైరాయిడ సమస్యలు రెండు రకాలు
-హైజోథైరాయిడిజం - ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్ వ్యాధి. శరీరంలో కావల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది.
-హైపర్ థైరాయిడిజం - థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది.
-ఈ రెండింటిలో హైపోథైరాయిడిజం సాధారణంగా కనిపించే సమస్య. ఇది ఏ వయసులో వారికైనా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

దుష్ఫలితాలు
-గాయిటర్
-థైరాయిడ్ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గాయిటర్ అని అంటారు. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో హైపర్ థైరాయిడిజం ఒకటి. గొంతు కింద వాపు పెరగడం వల్ల శ్వాసనాళం, ఆహార నాళం పైన ఒత్తిడి పెరిగి మింగడానికి కష్టంగా ఉండటం, స్వరంలో మార్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇవి కాకుండా హైపోథైరాయిడిజం లక్షణాలు ముఖ్యంగా బరువు పెరగడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

మెక్సెడిమా
-ఇది చాలా అరుదుగా కనిపించే ప్రాణాంతకర సమస్య దీర్ఘకాలికంటా హైపోథైరాయిడిజం నిర్ధారణ చేయకపోవడం లేదా అనియంత్రణలో ఉండడం వల్ల వస్తుంది. చలికి తట్టుకోలేకపోవడం, మగత, బద్ధకం, సృ్సహ కోల్పోవడం వల్ల వస్తుంది. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు, ఒత్తిడి, కొన్ని రకాల మందులు మొదలైన వాటి వల్ల వ్యాధి తీవ్రతరం అవుతుంది.

సంతాన సాఫల్య సమస్యలు
-థైరాయిడ్ హార్మోన్ తక్కువ మోతాదులో ఉండడం వల్ల సరైన సమయంలో అండం విడుదల కాకపోవడం, అండం ఫలదీకరణకు అనువుగా ఉండకపోవడం వంటి సమస్యలు రావచ్చు. లేదా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం, ప్రొజెస్టిరాన్ తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.

గర్భిణిలలో హైపోథైరాయిడిజం
-గర్భిణిలలో హైపోథైరాయిడిజం వల్ల నెలలు నిండక ముందే ప్రసవం కావడం, లేదా బుద్ధి మాంద్యం కలిగిన పిల్లలు పుట్టడం, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు తలేత్తేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక దశలో చికిత్స తీసుకోవడం మంచిది

నిర్ధారణ పరీక్షలు
-థైరాయిడ్ ప్రొఫైల్ టి3, టి4, టీహెచ్‌ఎస్ పరీక్షలు
-యాంటి థైరాయిడ్ యాంటీ బాడీస్
-అల్ట్రాసౌండ, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా నిర్ధారించబడుతుంది.

హోమియో చికిత్స
-హోమియో వైద్యం ద్వారా హైపోథైరాయిడ్‌కి గల మూల కారణాన్ని తొలగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా వ్యాధి నయం చేయబడుతుంది. రోగి శరీర తత్తాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, శారీరక లక్షణాలను బట్టి హోమియో మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి హైపోథైలమస్, పిట్యూటరీ వ్యవస్థను సరిచేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి సాధారణ స్థాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేసి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్‌ల సమతుల్యతను కాపాడుతుంది.

3213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles