థైరాయిడ్ సమస్యలకు చక్కని చికిత్స


Wed,June 15, 2016 01:02 AM

మన శరీరంలోని వినాళ వ్యవస్థలో థైరాయిడ్ ముఖ్యమైన గ్రంథి. దీని ప్రభావం అన్ని జీవ క్రియలపైనా ఉంటుంది. ఈ గ్రంథి గొంతు భాగంలో థైరాయిడ్ కార్టిలేజ్ అనే మృదులాస్థి పైన ఉంటుంది.
థైరాయిడ్ గ్రంథి టి3, టి4 (టి3 - ట్రై అమెడక్ష థైరాక్సిన్, టి4 - థైరాక్సిన్) అని రెండు హార్మోన్‌లు ఉత్పత్తి చేయాలంటే హైపోథాలమస్ పిట్యూటరి గ్రంథి నుంచి వచ్చే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజ పరచాలి. థైరాయిడ్ హర్మోన్ ఉత్పత్తిలో అయోడిన్ పాత్ర అతి ముఖ్యమైనది.
థైరాయిడ్ హార్మోన్ అన్ని జీవక్రియల మీద ప్రభావాన్ని చూపుతుంది. ఎదుగుదల, కార్బోహైడ్రేట్, కొవ్వు పదార్థాల సంశ్లేషణ, బేసల్ మెటబాలిక్ రేట్, శ్వాస వ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణ వ్యవస్థ, సంతాన సాఫల్యం వంటి అనేక వ్యవస్థల మీద దీని ప్రభావం ఉంటుంది. పిండ దశలో, పుట్టిన తర్వాత మొదటి 4,5 నెలలల్లో దీని ఆవశ్యకత చాలా కీలకమైనది.
కారణాలు - కుటుంబ చరిత్రలో థైరాయిడ్ సమస్యలు ఉన్నపుడు కూడా తర్వాత తరంలో వారికి రావచ్చు.
అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
పార్శియల్ థైరాయిడెక్టమి వల్ల, పిట్యూటరీ గ్రంధిలో వచ్చే వ్యాధుల వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
రకాలు
హైపోథైరాయిడిజం - ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్ వ్యాధి. శరీరంలో అవసరమైనంత థైరాక్సిన్ ఉత్పత్తి జరగదు. ఏవయసు వారికైనా ఈ సమస్య రావచ్చు కానీ పిల్లలు, స్త్రీలలో పిల్లలకు ఎక్కువగా కనిపిస్తుంది.
లక్షణాలు
యుక్తవయసు వారిలో - ఒంట్లో నీరు చేరి బరువు పెరగడం, బీఎంఆర్ తగ్గిపోవడం, నెలసరులు ఆలస్యంగా ప్రారంభం కావడం, నెలసరులు క్రమం తప్పడం, అమెనోరియా, అధిక రక్తస్రావం, సంతాన లేమి, చర్మం పొడి బారడం, జట్టు రాలిపోవడం, బద్దకంగా ఉండడం, చలి తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
హైపర్ థైరాయిడిజం - థైరాక్సిన్ ఎక్కువ మోతాదులో థైరాక్సిన్‌ను విడుదల చేయడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజం అంటారు.
లక్షణాలు- ఆహారం సరైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధిక చమటలు, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండడం, నెలసరులు త్వరత్వరగా రావడం, అధిక రక్తస్రావం వంటిలక్షణాలు కనిపిస్తాయి.
హషిమోటోస్ థైరాయిడైటిస్ - ఇది జీవన క్రియల అసమతుల్యత వల్ల వచ్చే థైరాయిడిజం దీనిలో థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటిబాడిస్ ఉత్పన్నం అయి థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచెయ్యనివ్వవు. ఇందులో హైపో, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది.
గాయిటర్ - థైరాయిడ్ గ్రంథిలో వాపు రావడాన్ని గాయిటర్ అంటారు. కొన్ని సందర్భాలలో దీని పరిమాణం కంటే రెండింతలు పరిమాణం వాపు వచ్చి స్వర పేటికపైన ఒత్తిడి పెరగడం వల్ల వాయిస్‌లో మార్పు వస్తుంది. గాయిటర్ సమస్య ఉన్నపుడు టీ3, టీ4 సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ గాయిటర్ ప్రభావం లేదని భావించలేము.
కారణాలు - గాయిటర్ ఏర్పడడానికి ముఖ్య కారణం అయోడిన్ లోపం . గ్రేవ్స్ డిజీజ్, పిట్యూటరీ గ్రంథి ట్యూమర్, థైరాయిడ్ క్యాన్సర్
లక్షణాలు - గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉంటుంది. స్వరంలో మార్పులు రావడం, ఎక్సాఆప్తల్మిక్ గాయిటర్ అనగా కననుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్టుగా ఉండడం.
హోమియో చికిత్స - చాలా మంది జీవితమంతా థైరాక్సిన్ మందులు వేసుకోవడం మినహా మరో మార్గం లేదు అనుకుంటారు. చాలా మందికి హోమియోవైద్యం పై సరైన అవగాహన లేకపోవడం వల్ల అలా అనుకుంటారు. చాలా మందికి వారు తీసుకునే థైరాక్సిన్ అనేది చికిత్స కాదు సప్లిమెంట్ అని తెలియదు. హోమియో వైద్యంలో రోగి శరీర తత్తంని బట్టి సరైన చికిత్స ఇస్తే థైరాయిడ్ సమస్యలను పూర్తిగా నయం చెయ్యవచ్చు.
srikanth

1791
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles