థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం


Wed,April 5, 2017 12:50 AM

edit
థైరాయిడ్ గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది ఒక అంతఃస్రావ గ్రంథి. టి3, టి4, టీఎస్‌హెచ్ కాల్సిటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలోని జీవ రసాయన క్రియలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా జీవరసాయన క్రియల్లో కేలరీల వినియోగ రేటును, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది.

థైరాయిడ్ హార్మోన్ల పరిమాణం టి3 (ట్రై అయడో థెరోనిన్) 80-180ఎంజీ/డీఎల్ టి4 (థైరాక్సిన్) 4.5 - 12.5 ఎంజీ/డీఎల్ టీఎస్‌హెచ్ (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) 0.5 -5.5 ఎంఐయూ/ఎల్

థైరాయిడ్ సమస్య రకాలు


-హైపోథైరాయిడిజం - ఈ సమస్యలో థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తి తగినంత ఉండదు.

కారణాలు


-హషిమోటోస్ థైరాయిడైటిస్ - ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. రక్షణ వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిపై దాడి చేస్తుంది. ఫలితంగా థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగిపోయి (గాయిటర్) చివరకు పనిచెయ్యడం మానేస్తుంది.

-సబ్ ఎక్యూట్ థైరాయిడైటిస్


- ఇది సాధారణంగా థైరాయిడ్ గ్రంథి ఇన్‌ఫ్లమేషన్ వల్ల లేదా గర్భవతులుగా ఉన్నపుడు మొదలవుతుంది. థైరాయిడ్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

-లక్షణాలు


- నీరసం, చలి తట్టుకోలేకపోవడం, మలబద్ధకం, కండరాల నొప్పులు, బరువు పెరగడం లేక తగ్గకపోవడం, ఆకలి లేకపోవడం, గాయిటర్, పొడిబారిన చర్మం, జుట్టు బిరుసుగా మారడం, రాలిపోవడం, కళ్లు ముఖంలో వాపు, బొంగురు గొంతు, నెలసరి సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగడం.

హైపర్ థైరాయిడిజం


-లక్షణాలు - మానసిక ఆందోళన, చిరాకు, గుండె దడ/ గుండె వేగంగా కొట్టుకోవడం, వేడి తట్టుకోలేకపోవడం, చెమటలు ఎక్కువగా రావడం, వణుకు, బరువు తగ్గడం లేదా పెరుగడం, ఆకలి పెరుగడం, విరేచనాలు, కాలి కింద భాగంలో వాపు, ఆకస్మికంగా పక్షవాతం రావడం, ఊపిరి అందకపోవడం, నెలసరి సమస్యలు, సంతాన సంబంధ సమస్యలు, నిద్రపట్టకపోవడం, చూపు సమస్యలు, నీరసం, థైరాయిడ్ గ్రంథి వాపు.
DrAL

హోమియో చికిత్స


హోమియోపతి వైద్య విధానంలో కేవలం లక్షణాలు తగ్గించే చికిత్స కాకుండా శారీరక మానసిక లక్షణాలు, కుటుంబ నేపథ్యం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం కాకుండా వ్యాధిని పూర్తిగా నయం చేస్తుంది. కాబట్టి మంచి హోమియోపతి నిపుణులచేత వైద్యం చేయించుకుంటే శాశ్వత పరిష్కారం పొందవచ్చు.

2509
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles