తొలి రోబో బార్


Wed,January 9, 2019 01:17 AM

చాలామంది న్యూఇయర్‌కి బార్‌కో, పబ్‌కో వెళ్లే ఉంటారు. కస్టమర్లతో కిటకిటలాడినప్పుడు మనమిచ్చిన ఆర్డర్ ఏ గంటకో వచ్చి చిరాకు పుట్టవచ్చు. కానీ అక్కడ క్షణాల్లో మీ ముందు కాక్‌టెయిల్ వచ్చేస్తుంది. అదెలాగంటే ఇది మొత్తం చదువండి.
robo-bar
క్లాసిక్ మార్టిని, పవర్‌ఫుల్ టకీలా వంటి కాక్‌టెయిల్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. మిగతా మిక్సింగ్‌లకు వచ్చేసరికి మరింత సమయం పట్టవచ్చు. బార్‌లకు వెళ్లినప్పుడు బార్ టెండర్లు చేసేలోపు మనకు తాగాలన్నా ఆశ కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే.. బార్‌లో మనతో పాటు ఎంతోమంది ఆర్డర్ ఇచ్చి ఉంటారు. వాళ్లందరికీ డ్రింక్ సర్వ్ చేయాలంటే మాటలు కాదు. కానీ మన ఆశ చావకుండా, కోరిన కాక్‌టెయిల్ మన ముందుకు రావాలంటే కాస్త లాస్‌వేగాస్ దాకా వెళ్లి రావాల్సిందే! అక్కడ ద టిప్సి రోబో బార్ ఉంది. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి రోబో బార్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ఉన్న రెండు రోబోలు క్షణం తీరిక లేకుండా కాక్‌టెయిల్ మిక్సింగ్‌లతోనే గడిపేస్తాయి. కస్టమర్లు కంప్యూటర్ ద్వారా ఆర్డర్ చేస్తే కావాల్సిన కాక్‌టెయిల్‌ని టేబుల్ ముందుంచుతాయి. ఆ డ్రింక్స్ తీసుకొచ్చేవి కూడా రోబోలే! సుమారు గంటకు 120 డ్రింక్స్‌ను అందించేస్తుంది. అంటే.. 60 నుంచి 90 సెకన్లలో ఒక డ్రింక్‌ని తయారు చేయడానికి ఈ రోబోలు సమయం తీసుకుంటాయి.

1444
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles