తేనెతుట్టెను వదిలించండిలా?


Fri,February 8, 2019 01:39 AM

honey
-ఇంట్లో ఒకటి, రెండు తేనెటీగలు కనిపిస్తే చుట్టుపక్కల ఎక్కడో దగ్గర్లోనే తేనెతుట్టె కూడా ఉంటుంది. త్వరగా తేనెతుట్టెను తీసెయడం మంచిది. కావాల్సిన పనిముట్లను అమర్చుకొని తేనెటీగలను వెతకండి.
-చాలా కంపెనీలు తేనెతుట్టెలను ఉచితంగానే తొలిగిస్తాయి. కాబట్టి తేనెతెట్టె కనిపిస్తే వెంటనే స్థానిక లిస్టింగ్స్ చెక్ చేయండి. తేనెటీగల కీపర్ వాటిని చంపకుండా తెట్టెలను తీసేస్తారు.
-తేనెతుట్టె నుంచి తేనెటీగలను బయటికు తొలిగించడానికి పొగ, అగరుబత్తిని వాడొచ్చు. ఇలా చేస్తే తేనెటీగలు నెమ్మదిగా తేనెతుట్టెను ఖాళీ చేస్తాయి. ఒకసారి తేనెతుట్టె ఖాళీ అయిందంటే దాన్ని సులువుగా తొలిగించవచ్చు.
-తేనెతుట్టె కనిపిస్తే రాత్రిపూట దాని కింద కాగితం, కట్టె ముక్కను కాల్చి పెడితే తేనెటీగలు పారిపోతాయి. తేనెటీగలు దాక్కునే ప్రదేశాలు వదలకండి. లేకుంటే అవి తప్పించుకొని మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.
-తేనెటీగలు నీళ్ళు లీకవుతున్న ట్యాంకులు, తెరచి ఉన్న ఫౌంటేన్లకి ఎక్కువ ఆకర్షిస్తాయి. అందుకని ఆ ప్రదేశాలను, వస్తువులును తీసేయండి.
- తేనెతుట్టె తీయడానికి మందపాటి దుస్తులు ధరించండి. గ్లోవ్స్, తలకి హెల్మెట్ లాంటివి పెట్టుకోండి. ఫెర్ఫ్యూమ్ వాడకూడదు.

632
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles