తేనెటీగల సంరక్షణ కోసం!


Mon,March 25, 2019 01:37 AM

తేనెటీగలు భూమ్మీద అంతరించిన నాలుగేండ్ల కంటే ఎక్కువగా మనిషి జీవించలేడని భౌతికశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారు. పట్టణీకరణలో భాగంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇండ్ల నిర్మాణాలు పెరగడంతో.. తేనెటీగలు అంతరించి పోతున్నాయి. దీంతో పూణెలోని పలు సంస్థలు తేనెటీగల సంరక్షణకు శ్రీకారం చుట్టాయి.
kvic
వివిధ పంటలు, మొక్కలు, చెట్లు ఫలదీకరణం చెందే దిశలో తేనెటీగల కృషి ఎంతో ఉన్నది. అవి కనుమరుగయితే పంటలు పండడం, పండ్లు, పూలు పూయడం అనే ప్రక్రియ సాధ్యపడదు. అవి లేకపోతే సమస్త జీవరాశులకు మప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. అటువంటి ప్రమాదం నుంచి తప్పించేందుకు మహారాష్ట్రలోని పూణెలోగల సెంట్రల్ బీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీబీఆర్టీఐ)పూనుకున్నది. ఈ సంస్థ తేనెటీగల వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయడమేకాకుండా, వాటి పెంపకంపై శిక్షణ ఇస్తుస్తున్నది. సీబీఆర్టీఐకి అనుబంధంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ), నేషనల్ బీ బోర్డు(ఎన్‌బీబీ) సంస్థలు పట్టణాల్లో నివసించే వారికి తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నాయి. ఒక్కో బ్యాచ్‌లో 25మంది సభ్యులుంటారు. వీరిలో రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులకు కూడా ఉన్నారు. అందరికీ తేనెటీగల పెంపకంపై ఉచితంగా శిక్షణ ఇస్తూ.. వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంరక్షణను ఉద్యమంగా చేపట్టి అన్ని వర్గాల వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

250
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles