తేనెటీగల ప్రేమికుడు!


Thu,February 28, 2019 01:52 AM

ఎక్కడికెళ్లినా ఆయన్ను వదలవు ఇప్పటి వరకూ కుక్క, పిల్లి, ఆవు,చిలుక,గుర్రం వంటి పెంపుడు జంతువులను పెంచుకున్నవాళ్లను మాత్రమే చూసి ఉంటాం.
ఈశాన్య ఆఫ్రికాలోని ఇథియోపియాలో ఉన్న ఒరోమియా ప్రాంతానికి చెందిన గోసా అనే తేనెటీగల ప్రేమికుడు తేనెటీగలను తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. అంతేకాదు గోసా ఎక్కడకు వెళ్తే అవి అక్కడకు వెళ్తుంటాయి.

father-of-bees
ఈశాన్య ఆఫ్రికాలోని ఇథియోపియాలో ఉన్న ఒరోమియా ప్రాంతంలో నివాసముంటున్న గోసా టఫీస్ ఇంట్లో పదిహేనేండ్ల క్రితం ఓ రోజు తేనెటీగలు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. గోసా కొద్దిరోజుల వరకూ వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేయలేదు. అలా కొద్ది రోజుల్లోనే గోసాతో సహా ఆయన కుటుంబ సభ్యులకు తేనెటీగలు మిత్రులుగా మారాయి.ఆయన కూడా వాటిని అలాగే చూసుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి గోసా కుటుంబ సభ్యులనెవరినీ కుట్టకుండా వారితో స్నేహపూర్వకంగా మెలిగేవి. అలా దాదాపు 15 ఏండ్లు గడిచిపోయింది. గోసా ఎక్కడికి వెళ్లినా సరే అతన్ని అనుసరిస్తూ ఆయన వెంటే తిరుగుతున్నాయి. ఒకసారి పెద్ద తేనెతుట్టెను ఏర్పాటు చేశాయి. దాని నుంచి 30 కిలోలకుపైగా తేనె వచ్చింది. గోసా కుటుంబ సభ్యులను తప్ప ఇంకెవరినీ ఇంట్లోకి రానిచ్చేవి కావు . దాంతో తన స్నేహితులు గానీ బంధువులు గానీ గోసా ఇంట్లోకి రావడానికి చాలా భయపడేవారు. అందుకోసమే గోసా వాటిని బయటకు పంపించే ప్రయత్నం చేసినా మళ్ల్లీ వచ్చాయి. తన ఊళ్లో వారందరూ అప్పటి నుంచి గోసాను ఫాదర్ ఆఫ్ బీస్ అని పిలుస్తుండేవాళ్లు. తేనెటీగలు ఇంట్లో ఉండడం వల్ల తమ స్నేహితులు రాలేకపోతున్నారని గోసా కుమార్తె యెమరిమ్ వర్క్ అంటున్నది. ఇప్పటి వరకూ తాను మూడు పట్టణాలకు వెళ్లానని, ఎక్కడికి వెళ్లినా తనను వదలకుండా తేనెటీగలు తన వెంట రావడం చాలా ఆశ్చర్యంగా ఉందని గోసా చెబుతున్నాడు.

531
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles