తెల్లవెంట్రుకలు నల్లగా మారాలంటే!


Mon,March 4, 2019 01:39 AM

చాలామందికి చిన్నవయసులోనే తల వెంట్రుకలు తెల్లగా మారిపోతుంటాయి. దీంతో జుట్టుకు నల్లరంగు వేసుకుంటూ ఉంటారు. తెల్లవెంట్రుకలతో బాధపడేవారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు నల్లగా మారుతుంది.
white-hair
-జుట్టుకు రంగు వేసుకోవాలంటే మొదటగా గుర్తొచ్చేది హెన్నా. ఈ పౌడర్‌ని ఆముదంలో మరిగించాలి. చల్లారాక దీన్ని జుట్టు కుదుళ్లకు అంటేలా రాయాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
-బ్లాక్ టీతో కూడా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బ్లాక్ టీపొడిని నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు రాయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-రాత్రి పడుకునే ముందు ఉసిరికాయ, కుంకుడు కాయ, శీకాకాయల మిశ్రమాన్ని బాగా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే దాంట్లో మైదాకు కలిపి మరో రెండు గంటలు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయి.
-కాఫీతోనూ తెల్లజుట్టును కవర్ చేయవచ్చు. రెండు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడిని కప్పు నీటిలో మరిగించాలి. చల్లారాక స్ప్రే బాటిల్‌లో పోసి జుట్టు కుదుళ్లపై చల్లాలి. తర్వాత మసాజ్ చేసి గంటపాటు షవర్‌క్యాప్ ధరించాలి. తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.

1532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles